AP High Court: కాకాణి నేరానికి ఆధారాలున్నాయి
ABN, Publish Date - Apr 04 , 2025 | 06:14 AM
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా వేసింది. కోర్టు విచారణలో పిటిషనర్‌ను అరెస్ట్ చేయడంపై వాదనలు వినిపించారు

ఎస్సీ,ఎస్టీ చట్టం కింద నమోదైన కేసు ఇది
హైకోర్టుకు నేరుగా రావడానికి వీలులేదు
ముందస్తు బెయిల్ ఇవ్వాల్సింది ప్రత్యేక కోర్టే
వాదనలు వినిపించిన ఏజీ దమ్మాలపాటి
విచారణను నేటికి వాయిదావేసిన హైకోర్టు
అమరావతి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైనందున ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణార్హత లేదని పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ లేక బెయిల్ కోసం ముందుగా సంబంధిత ప్రత్యేక కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు. గోవర్ధన్‌రెడ్డి నేరానికి పాల్పడ్డారనేందుకు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయన్నారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్‌కు వర్తించవన్నారు. ఎస్సీ,ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదైనప్పుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చన్నారు. పిటిషనర్‌ను అరెస్ట్ చేస్తారనేందుకు సహేతుకమైన కారణాలు ఉన్నందున, మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. గురువారం కోర్టు సమయం ముగియడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణార్హతపై పూర్తిస్థాయి వాదనల కోసం విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదే కేసును కొట్టివేయాలని కోరుతూ కాకాణి వేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా అదేరోజుకు వాయిదా వేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, వరదాపురం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి, తరలించారని జిల్లా మైనింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీనాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 04 , 2025 | 06:16 AM