Rice Export Case : బియ్యం ‘సిట్’లో మార్పులు
ABN, Publish Date - Jan 01 , 2025 | 07:02 AM
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతి వ్యవహారం లో బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’లో ఎట్టకేలకు మార్పులు జరిగాయి.
డీఎస్పీలు అవుట్.. సబ్ కలెక్టర్లు ఇన్..
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదలిక
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతి వ్యవహారం లో బాధ్యులను గుర్తించి చట్టపరంగా శిక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’లో ఎట్టకేలకు మార్పులు జరిగాయి. డిసెంబరు 6న ఏర్పాటు చేసిన సిట్‌లో అందరూ పోలీసులే ఉండటం చర్చనీయాం శం అవడంతో అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ ఆ విషయం ప్రచురించింది. వైసీపీ అనుకూల డీఎస్పీలు కూడా సిట్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై సమీక్షించుకున్న ప్రభుత్వం, తాజా గా ఇద్దరు డిప్యూటీ కలెక్టర్లు, పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల నుంచి ఒక్కొక్కరి చొప్పున సిట్‌లో చేర్చింది. అయితే సిట్ అధిపతిగా సీఐడీ ఐజీ వినీత్ బ్రిజిలాల్‌ను కొనసాగించిన ప్రభుత్వం గత సిట్‌లో ఉన్న సీఐడీ ఎస్పీ బి.ఉమా మహేశ్వరరాజును మార్చలేదు. తాజా సిట్‌లో ఎ.శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్(బీసీ వెల్ఫేర్), కాకినాడ; పి. రోహిణీ, ఆర్జేడీ (మహిళా శిశు సంక్షేమం) కర్నూలు; కె.మధుసూదనరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి, విజయనగరం; ఎం.బాల సరస్వతి, కోనసీమ జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ను, సభ్యులుగా చేర్చి తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత సిట్‌లో సభ్యులుగా ఉన్న డీఎస్పీలు అశోక్ వర్ధన్ రెడ్డి, బాలసుందరరావు, గోవిందరావు, రత్తయ్యలను తప్పించింది.
Updated Date - Jan 01 , 2025 | 07:02 AM