Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. పని చేయని సీసీ కెమెరాలు..
ABN , Publish Date - Apr 15 , 2025 | 09:39 PM
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దారుణం చోటు చేసుకుంది. వివాహానికి వెళ్తూ.. మార్గమధ్యలో విజయవాడలో కొలువు తీరిన దుర్గమ్మను దర్శించుకొనేందుకు కారును పక్కన నిలిపి.. దర్శనానికి వెళ్లారు. కారులోని 25 కాసుల బంగారం మాయమైంది. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు.ఇక సీసీ కెమెరాలు సైతం పని చేయక పోవడం గమనార్హం.

విజయవాడ, ఏప్రిల్ 15: ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద కారులో ఉంచిన బంగారం చోరీకి గురైంది. ఓంకారం టర్నింగ్ పాయింట్ వద్ద పార్క్ చేసిన కారులోని బంగారం భారీగా చోరీ అయింది. 25 కాసులకుపైగా బంగారం చోరీ అయిందని బాధితులు వాపోయారు. అమలాపురంలో జరగనున్న వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తూ.. మార్గ మధ్యలో దుర్గమ్మ వారిని దర్శించుకొనేందుకు కారును ఓంకారం టర్నింగ్ వద్ద ఉంచారు. అనంతరం వారంతా దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు.
తిరిగి వచ్చి చూసే సరికి కారులోని బంగారం మాయమైనట్లు గుర్తించారు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే బంగారం చోరీకి గురైన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ పరిశీలించేందుకు పోలీసులు సమాయత్తమయ్యారు. అయితే సదరు సీసీ కెమెరాలు పని చేయడం లేదని పోలీసులు ఈ సందర్భంగా గుర్తించారు. ఈ విషయం భక్తులకు తెలియడంలో.. వారు మండి పడుతున్నారు. సీసీ కెమెరాలు పని చేయకుంటే.. బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Dy Collectors Transfer: భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే..
National Herald Case: ఈడీ ఛార్జ్‌షీట్లో సోనియా, రాహుల్ పేర్లు
BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త
Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..
PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
Hyderabad Summit:హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ..
For AndhraPradesh News And Telugu News