Amaravati Development Plan: అమరావతిపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంత్రి
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:22 PM
Amaravati Development Plan: రాజధానికి భూములిచ్చిన రైతులు అపోహ పడాల్సిన పనేం లేదని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్‌తో మూడేళ్లలో అమరావతి నిర్మణాన్ని పూర్తి చేస్తామన్నారు.

అమరావతి, ఏప్రిల్ 16: అమరావతిపై (AP Capital Amaravati) అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని.. అమరావతిపై లాంగ్ విజన్‌తో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఉన్నారని మంత్రి నారాయణ (Minister Narayana) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతుల భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలన్నారు. పరిశ్రమలు రావాలంటే అదనపు భూమి అవసరం ఉంటుందని చెప్పారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం ఉటుందన్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన వాటి విలువ పెరగడం కోసం మరికొంత భూమి అవసరమని చెప్పుకొచ్చారు. భూసేకరణ అయితే రైతులు నష్టపోతారని.. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఒక ఏడాది లోపే ఉద్యోగుల భవనాలు, ట్రంక్ రోడ్లు పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. అమరావతిలో విమానాశ్రయం రావాలని.. దీంతో అన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం నిర్ణయంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
భవిష్యత్‌లో అమరావతి, గుంటూరు, తాడేపల్లి, విజయవాడ అన్నీ కలిపి మెగా సిటీగా సీఎం మాస్టర్ ప్లాన్ రూపొందించారని మంత్రి తెలిపారు. మెగా సిటీకి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమని, దాని నిర్మాణానికి ఐదువేల ఎకరాలు కావాలన్నారు. ఈ మేరకు భూమిని పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని నిర్మణ పనుల కోసం కావాల్సిన గ్రావెల్ కోసం అమరావతిలోని అనంతవరం గ్రామ కొండలను మంత్రి పరిశీలించారు. రాజధాని అమరావతి కోసం మరోసారి సేకరించే భూమిని భూసేకరణ ద్వారా తీసుకోవాలా లేకపోతే భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా అనేది ఇంకా నిర్ణయం కాలేదన్నారు. భూ సేకరణ ద్వారా ఐదువేల ఎకరాలు తీసుకోవచ్చని కానీ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధర కంటే రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని సమీకరణ ద్వారా అయితే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు. అందుకే రైతులు ఆ పద్ధతికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇక భూసమీకరణలో ఐదువేల ఎకరాలు కావాలంటే సుమారు 30 వేల ఎకరాలను తీసుకోవాలని అందులో రోడ్లు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లు వేసి డ్రైయిన్‌లు కట్టాల్సి ఉంటుందన్నారు.
Saraswati Pushkaralu 2025: తెలంగాణలో పుష్కరాలకు వేళాయె.. ప్రత్యేక మొబైల్ యాప్ మీకోసమే
సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో విమానాశ్రయం నిర్మించినప్పుడు కూడా అంత భూమి ఎందుకని చాలా మంది విమర్శించారని గుర్తు చేశారు. కానీ ఈనాడు శంషాబాద్ విమానాశ్రయం ఉత్తమ విమానాశ్రయంలో ఒకటన్నారు. చంద్రబాబు రాబోయే వందేళ్ల గురించి ఆలోచిస్తారన్నారు. విమానాశ్రయంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా నగరాన్ని నిర్మించాలనే ఆలోచన ఉందన్నారు. దీనిని నిర్మిస్తే దేశ విదేశాల నుంచి క్రీడాకారులు, అభిమానులు వస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్, కంకర సరఫరా చేయడానికి గనుల శాఖ ఐదు జిల్లాల్లో 851 ఎకరాలను సీఆర్డీయేకు కేటాయించింది. వీటిలో ఏలూరు జిల్లాలో 355, కృష్ణాలో 428, పల్నాడులో 28, గుంటూరు 21, ఎన్టీఆర్ జిల్లాలో 18 ఎకరాలు ఉన్నాయి. రాజధాని గ్రామం అనంతవరంలోని కొండ ప్రాంతాన్ని 2014- 19లోనే సీఆర్డీయేకు ఇచ్చారు. అయితే గ్రౌండ్ లెవల్ కంటే ఆరు నుంచి ఎనిమిది మీటర్ల లోతు వరకు భూమిని తవ్వారన్నారు. ఆ ప్రాంతాన్ని డ్రోన్‌లతో సర్వే చేయించడంతో పాటు అనంతరం అధికారులతో చర్చించి గోతులను పూడ్చుతామన్నారు. ఈ భూమిని ఏదో ఒక అవసరాలకు వినియోగించాలనే ఉద్దేశంతో అనంతవరంకు వచ్చినట్లు మంత్రి తెలిపారు.
రాజధానికి భూములిచ్చిన రైతుల అపోహ పడాల్సిన పనేం లేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్‌తో మూడేళ్లలో అమరావతి నిర్మణాన్ని పూర్తి చేస్తామన్నారు. అధికారుల కోసం నిర్మించిన ప్రభుత్వ భవనాలను ఏడాది లోపు పూర్తి చేయడంతో పాటు ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కిలో మీటర్ల ట్రంక్ రోడ్లను నిర్మిస్తామన్నారు. రెండున్నరేళ్లలో రైతుల రిటర్నబుల్ ప్లాట్ల లే అవుట్‌లోని రోడ్లు, మూడేళ్లలో ఐకానిక్ టవర్లు నిర్మించడంతో పాటు ఇప్పటి అమరావతి పునర్నిమానానికి అవసరమైన 68 పనులకు సంబంధించి రూ.42,360 కోట్ల విలువైన టెండర్లు పూర్తి చేశామన్నారు. రాజధానిలో రూ.64,912 కోట్లతో మొత్తం 92 పనులు చేపడతామని మంత్రి వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానిని కట్టనప్పుడు 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసినా బాగుండేదన్నారు. వాటికి డబ్బులు చెల్లించకుండా అలాగే ఉంచడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయన్నారు. వాటిని ఏడు నుంచి ఎనిమిది కాలంలో పరిష్కరించి కొత్త టెండర్లను పిలిచినట్లు మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
Gold Locket: శబరిమల తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్న ఆంధ్రా వాసి..
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
Read Latest AP News And Telugu News