Skill Census: స్కిల్ సెన్సస్‌కు సాంకేతిక సహకారం.. ముందుకొచ్చిన సాఫ్ట్‌వేర్ సంస్థ
ABN, Publish Date - Jan 10 , 2025 | 10:46 AM
Skill Census: ఎటువంటి ఆర్థికవనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సస్‌లో భాగంగా జనరేటివ్ ఏఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. దీంతో ఇన్ఫోసిస్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)మధ్య రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది.
అమరావతి, జనవరి 10: యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్కిల్ సెన్సస్‌ను (Skill Census) ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని మరింత ప్రయోజనకరంగా చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) ముందుకు వచ్చింది. ఎటువంటి ఆర్థికవనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సస్‌లో భాగంగా జనరేటివ్ ఏఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. దీంతో ఇన్ఫోసిస్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) మధ్య రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సస్ డాటా ప్రివాలిడేషన్‌కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
దీని ద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి, మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యసాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సంతోష్, తిరుమల, స్కిల్ డెవలప్ మెంట్ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్‌మెంట్ ఉన్నతాధికారులు గణేష్ కుమార్, దినేష్ కుమార్, రఘు హాజరయ్యారు.
అదే లక్ష్యంతో...
కాగా.. రాష్ట్రంలోని యువత, మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం స్కిల్ సెన్సస్‌కు శ్రీకారం చుట్టింది. గత ఏడాది సెప్టెంబర్ 30న మంగళగిరి గ్రామాలతో పాటు రాజధాని గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌కు సర్వేను ప్రారంభించిన విషయం తెలిసిందే. యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగవకాశాలు కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డవలప్‌మెంట్ శాఖ, సిడాప్, న్యాక్ సిబ్బంది స్కిల్ సెన్సస్ నిర్వహిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి 675 మంది ఎన్యుమరేటర్లు వివరాలను సేకరించారు. దీని కోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేశారు.
ఇవి కూడా చదవండి...
Pawan: పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం.. మినీ గోకులం ప్రారంభించనున్న పవన్..
Minister Narayana: భవన నిర్మాణాలు, లేఅవుట్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Read Latest AP News And Telugu news
Updated Date - Jan 10 , 2025 | 10:59 AM