YS Sharmila: గోవింద నామాలు పలికే చోట మృత్యుఘోష.. షర్మిల ఆగ్రహం
ABN, Publish Date - Jan 09 , 2025 | 03:47 PM
YS Sharmila Reddy: లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేశారు.
విజయవాడ, జనవరి 9: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, టీటీడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు అంటూ మండిపడ్డారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష వినిపించిందన్నారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలన్నారు. వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఏపీసీసీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నామన్నారు.
మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట... కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయన్నారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని వైఎస్ షర్మిల రెడ్డి పేర్కొన్నారు. కాగా.. వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ల వద్ద గత అర్ధారాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరికొంతమంది గాయపడగా.. ప్రస్తుతం వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తిరుపతి ఘటనకు కారణం అదేనా.. వాళ్లను మందలించిన సీఎం
మృతుల కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలను రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. అలాగే ఆస్పత్రులకు వెళ్లి క్షతగ్రాలను పరామర్శించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. కాసేపటి క్రతమే తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి ప్రకారం ప్రతిఒక్కరూ పనిచేయాలని.. ఇది క్షమించాల్సిన తప్పు కాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Tirupati Stampede: తిరుపతి ఘటన మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సర్కార్
CM Chandrababu: తమాషాలొద్దు... పద్దతి మార్చుకోండి..
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 09 , 2025 | 03:47 PM