Holi wishes: హోలీ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు..

ABN, Publish Date - Mar 14 , 2025 | 10:25 AM

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ అని.. రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు, సంబరాలు నింపాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటి, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Holi wishes: హోలీ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు..
CM Chandrababu

అమరావతి: హోలీ పండుగ (Holi Festival) సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), ఐటీ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ప్రజలకు శుభాకాంక్షలు (Wishes) తెలియజేశారు. దేశ వ్యాప్తంగా అందరూ జరుపుకునే హోలీ పండుగ మన జీవితాల్లో కొత్త రంగులు నింపాలని కోరుకుంటున్నానని అన్నారు. వసంత కాలంలో మన ఆరోగ్యం కోసం నిర్వహించుకునే హోలీ పండుగను రసాయనాలు ఉపయోగించి కలుషితం చేయవద్దని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ‘కామ దహనం’ చేసి రంగులు చల్లుకుని, ఆనందం పంచుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని హోలీ పండుగ సందర్భంగా అందరికీ మరొక్కమారు శుకాంక్షలు తెలుపుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read..:

అందులో పవన్ కల్యాణ్ పీహెచ్‌డీ..


మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ అని.. రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు, సంబరాలు నింపాలని కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ మంత్రి లోకేష్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


రసాయన రంగుల నుంచి రక్షణ ఇలా...

బజారు నుంచి తెచ్చే హోలీ రంగుల్లో రసాయనాలు కలిసి ఉంటాయి. వీటి వల్ల చర్మానికి, కురులకు హాని కలుగవచ్చు. హోలీ ఆడే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రంగులు చల్లుకున్న తరవాత రసాయనాల ప్రభావం వల్ల చర్మం పొడిబారి మంటగా అనిపించవచ్చు. కాబట్టి ముందుగానే ముఖం, చేతులు, కాళ్లకు మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మంచిది. కొబ్బరి నూనె లేదా బాదం నూనె రాసుకున్నా ఫలితం ఉంటుంది. వీటిని రాసుకోవడం వల్ల రంగులు చర్మం లోపలి పొరల్లోకి ప్రవేశించలేవు.

హోలీ ఆడే ముందు తలకు కొబ్బరినూనె లేదా ఆలివ్‌ నూనె రాసుకోవాలి. దీనివల్ల మాడు మీద రక్షణ పొర ఏర్పడి వెంట్రుకల కుదుళ్లలోకి రంగులు చొచ్చుకుని పోకుండా ఉంటాయి. నూనె రాయడం వల్ల శిరోజాలకు రంగులు అంతగా పట్టవు. తలస్నానం చేసిన వెంటనే తేలికగా రంగులు వదిలిపోయి వెంట్రుకలు మృదువుగా మెరుస్తాయి.

రంగుల నుంచి శిరోజాలను కాపాడుకోవడానికి టోపీ, స్కార్ప్‌ ధరించవచ్చు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే తేలికపాటి నూలు బట్టలు వేసుకోవాలి. దుస్తులు మరీ బిగుతుగా కాకుండా కొద్దిగా వ దులుగా ఉన్నవి అయితే మంచిది. పాదాలకు షూస్‌ ఽవేయడం ఉత్తమం.

గోళ్లకు రంగులు అంటకుండా నెయిల్‌ పాలిష్‌ వేస్తే మంచిది

హోలీ ఆడడానికి వెళ్లే ముందు పెదవులకు లిప్‌ బామ్‌ వేసుకోవాలి. లేదంటే రంగుల వల్ల పెదవులు తేమను కోల్పోతాయి. వాటిపై పగుళ్లు ఏర్పడి రక్తస్రావం కావచ్చు.

హోలీ ఆడిన తరవాత ముఖాన్ని, చేతులను సబ్బుతో ఎక్కువగా రుద్దకూడదు. సున్నిపిండి లేదా శనగపిండిని ఉపయోగించడం మంచిది.


ఈ వార్తలు కూడా చదవండి..

ABN Effect:వీఆర్‌‌కు సీఐ భుజంగరావు

ఆ రంగులు వాడితే విషాదం...

గ్రూప్‌-3 ర్యాంకింగ్‌ జాబితా ఎప్పుడంటే..

For More AP News and Telugu News

Updated Date - Mar 14 , 2025 | 10:25 AM