Free Gas Cylinder: తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పటి వరకు అంటే..

ABN, Publish Date - Mar 26 , 2025 | 01:31 PM

పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ చేస్తారని మంత్రి నాడేండ్ల అన్నారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

Free Gas Cylinder: తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పటి వరకు అంటే..
Free Gas Cylinder

అమరావతి: దీపం-2 పథకం (Deepam-2 Scheme)లో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ (Free Gas Cylinder)మార్చి 31 వరకే అవకాశం (March 31 Deadline)ఉందని ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ఆహార పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) సూచించారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీ మేరకు కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్స్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీని కూటమి సర్కార్ నిలబెట్టుకుంటోందన్నారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుందన్నారు.

Also Read..: మద్యం స్కాంను తీవ్రంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం


పట్టణ ప్రాంతాల్లో..

పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ చేస్తారని మంత్రి నాడేండ్ల అన్నారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కూడా ఉందని మంత్రి చెప్పారు.

ప్రతి ఏడాది

ప్రతి ఏడాది ఏప్రిల్ - జూలై (01), ఆగష్టు –నవంబర్ (01), డిసెంబర్ –మార్చి (01) నెలల మధ్య ఉచిత గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవచ్చునని, ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.


ఎలా పొందవచ్చంటే..

రేషన్‌కార్డు ఉన్న గ్యాస్‌ వినియోగదారులంతా ఫ్రీ గ్యాస్​ సిలిండర్‌ పొందేందుకు అర్హత ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. గ్యాస్‌ కనెక్షన్‌కు ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్ లింక్ అయ్యాయో లేదో చూసుకోవాలి. బ్యాంకు అకౌంట్ యాక్టివ్‌లొ లేకపోతే వెంటనే పునరుద్ధరించుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ స్కీమ్ ప్రారంభం నుంచి అధికార యంత్రాంగం మండలాల వారీగా లబ్ధిదారులను చాలా వరకు అప్రమత్తం చేయడంతో ఎక్కువ శాతం మంది ఇప్పటికే లబ్ధి పొందారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్‌ తీసుకున్న వారికి నిర్ణీత వ్యవధిలో సొమ్ము వారి బ్యాంక్​ అకౌంట్​లో జమ అవుతుంది. పలువురికి సాంకేతిక కారణాలతో డబ్బులు అకౌంట్​లో పడలేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తొలి ఫ్రీ గ్యాస్ సిలిండరు పొందని వారు ఉంటే వెంటనే బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సొంతపార్టీ ఎంపీపీ కిడ్నీప్..

ఎమ్మెల్యే కూనంనేని చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ప్రస్తావన

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

For More AP News and Telugu News

Updated Date - Mar 26 , 2025 | 01:31 PM