Share News

స్టెల్లాలో క్రమశిక్షణకు పెద్దపీట

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:40 AM

మారిస్‌ స్టెల్లా కళాశాలలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్డు ఏజీపీ, కళాశాల పూర్వవిద్యార్థిని ఓరుగంటి సాయమ్మ తెలిపారు.

స్టెల్లాలో క్రమశిక్షణకు పెద్దపీట
ఓరుగంటి సాయమ్మను సత్కరిస్తున్న స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్‌, కరస్పాండెంట్‌

స్టెల్లాలో క్రమశిక్షణకు పెద్దపీట

పూర్వ విద్యార్థినుల సమావేశంలో ఏపీ హైకోర్టు ఏజీపీ ఓరుగంటి సాయమ్మ

బెంజిసర్కిల్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): మారిస్‌ స్టెల్లా కళాశాలలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తారని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్డు ఏజీపీ, కళాశాల పూర్వవిద్యార్థిని ఓరుగంటి సాయమ్మ తెలిపారు. పూర్వవిద్యార్థుల సంఘం (అలూమిని అసోసియేషన్‌) ఆధ్వర్యంలో శనివారం కళాశాల ఆడిటోరియంలో స్టార్‌ మీట్‌-2025 కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాయమ్మ మాట్లాడుతూ కళాశాలలో సర్వతో ముఖాభివృద్ధి ఉంటుందని, దీనిని విద్యార్థిను లందరూ సక్రమంగా వినియోగించుకొని ప్రయోజనం పొందాలని సూచించారు. కళా శాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిస్టర్‌ జసింత క్వాడ్రస్‌, కరస్పాండెంట్‌ లిన క్వాడ్రస్‌లు మాట్లాడుతూ కళాశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థినులు ఉన్నత పదవుల్లో ఉండటం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో సిస్టర్‌ ఇన్నసియమ్మ, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్‌ ఉషాకుమారి, డిగ్రీ వైస్‌ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిస్టర్‌ లావణ్య, ఇంటర్‌ వైస్‌ప్రిన్సిపాల్‌ స్వప్న, స్టూడెంట్స్‌ డీన్‌ పద్మలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థినులు తమ విద్యా అనుభవాలను తోటివారితో పంచుకొని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. విద్యార్థినులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాయమ్మను కళాశాల ప్రిన్సిపాల్‌, కరస్పాండెంట్‌లు ఘనంగా సత్కరించారు.

Updated Date - Apr 13 , 2025 | 12:40 AM