Share News

పెన్షనర్ల ప్రయోజనాలను దెబ్బతీయొద్దు

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:30 AM

నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌సీసీపీఏ) పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లులో భాగంగా పెన్షనర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేసిన మార్పులను రద్దు చేయాలని కోరుతూ గురువారం ఎంజీ రోడ్డులోని కంట్రోలర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అకౌంట్స్‌ (సీసీఏ-పెన్షన్‌) కార్యాలయం వద్ద బీఎస్‌ఎన్‌ఎల్‌లోని ప్రధాన పెన్షనర్‌ సంఘాలు ధర్నా నిర్వహించాయి.

పెన్షనర్ల ప్రయోజనాలను దెబ్బతీయొద్దు
సీసీఏ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న పెన్షనర్‌ సంఘాల నేతలు

పెన్షనర్ల ప్రయోజనాలను దెబ్బతీయొద్దు

సీసీఏ కార్యాలయం వద్ద నిరసన

గవర్నర్‌పేట, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌సీసీపీఏ) పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లులో భాగంగా పెన్షనర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేసిన మార్పులను రద్దు చేయాలని కోరుతూ గురువారం ఎంజీ రోడ్డులోని కంట్రోలర్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌ అకౌంట్స్‌ (సీసీఏ-పెన్షన్‌) కార్యాలయం వద్ద బీఎస్‌ఎన్‌ఎల్‌లోని ప్రధాన పెన్షనర్‌ సంఘాలు ధర్నా నిర్వహించాయి. ధర్నా కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌లోని ప్రధాన పెన్షనర్స్‌ సంఘాలు ఏఐబీడీపీఏ, ఏఐబీఎస్‌ ఎన్‌ఎల్‌, ఎస్‌ఎన్‌పీడబ్ల్యూఏ, ఏఐఆర్‌బీఎస్‌ ఎన్‌ఎల్‌ ఈడబ్ల్యూఏ పాల్గొన్నాయి. ఎండ వేడిమిని కూడా లెక్కచేయకుండా దాదాపు 250 మంది పెన్షనర్లు హాజరై నిరసన తెలియజేశారు. పెన్షనర్ల ప్రయోజనాలు కాపాడాలని, పెన్షనర్లకు వ్యతిరేకంగా చేసిన మార్పులు రద్దు చేయాలని నినాదాలు చేశారు. నిరసనలో పెన్షనర్‌ సంఘాల నేతలు వి. వరప్రసాద్‌, పి. అశోక్‌ బాబు, ఏ. కోటేశ్వరరావు, ఎం. వెంకటేశ్వరరావు, ఎ. చంద్రశేఖర్‌, ఎల్‌. రమేష్‌బాబు, సీఐటీఐ జిల్లా అధ్యక్షుడు ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. నిరసన అనంతరం పెన్షనర్‌ సంఘాల నేతలు సీసీఏ (ఏపీ సర్కిల్‌)ను కలిసి ప్రభుత్వం ఆర్థిక బిల్లులో ప్రవేశ పెట్టి ఆమోదం చేసుకున్న పెన్షన్‌ సవరణకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీకి అడ్రస్‌ చేస్తూ తయారు చేసిన వినతిపత్రాన్ని సీసీఏకు అందజేశారు.

Updated Date - Apr 04 , 2025 | 12:30 AM