Share News

Foundation Stone: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ శంకుస్థాపన.. భువనేశ్వరి పూజలు..

ABN , Publish Date - Mar 06 , 2025 | 09:50 AM

ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత చేరువచేసేందుకు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం నిర్మాణాన్ని చేపడుతున్నారు. భవన నిర్మాణానికి గురువారం ఉదయం నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.

Foundation Stone:  ఎన్టీఆర్ ట్రస్టు భవన్ శంకుస్థాపన.. భువనేశ్వరి పూజలు..
NTR Trust Bhavan in Vijayawada

విజయవాడ: నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్‌ ట్రస్టు భవన్ (NTR Memorial Trust Bhavan) శంకుస్థాపన (Foundation Stone) గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేశారు. బెజవాడలో 16వ జాతీయ రహదారి వెంబడి ఎల్‌ఈపీఎల్‌ మాల్‌ పక్కన, సాయిబాబా టెంపుల్‌ రోడ్డు జంక్షన్‌లో జీప్లస్‌5 విధానంలో అధునాతనంగా ఈ భవనం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read More News..:

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..


దాదాపు 600 గజాల స్థలాన్ని కొద్దికాలం కిందట ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో కూడా సేవా కార్యక్రమాలను చేపట్టడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భవనం పూర్తయితే ట్రస్ట్‌ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. ముఖ్యంగా విద్య, వైద్య సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. హైదరాబాద్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌లో పనిచేస్తున్న కొంతమంది ఇక్కడికి బదిలీ కానున్నారు. అవసరాన్ని బట్టి స్థానికంగా కూడా నియమాకాలు ఉంటాయి.


పేదలకు విద్య, వైద్యసాయం..

కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులకు విద్య, వైద్య సాయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. నూతనంగా నిర్మించే ఈ ట్రస్ట్ భవనంలో తలసేమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ కూడా ఇందులోనే ఏర్పాటుకానున్నాయి. తలసేమియా రోగులకు అవసమైన వైద్య సేవలను ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందిస్తారు. తలసేమియా కేర్ సెంటర్ నుంచే వైద్య సేవలు, రక్తదానం, ఇతర సేవా కార్యక్రమాలను అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

యాదగిరిగుట్ట 6వ రోజు బ్రహ్మోత్సవాలు..

ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 06 , 2025 | 09:50 AM