నైపుణ్యాలు పెంచుకుంటే ఉపాధి మెరుగు
ABN , Publish Date - Apr 16 , 2025 | 12:24 AM
విద్యార్థినులు నైపుణ్యాలు పెంచుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మారిస్ స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వాడ్రస్ అన్నారు.

నైపుణ్యాలు పెంచుకుంటే ఉపాధి మెరుగు
స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్
డాక్టర్ జసింత క్వాడ్రస్
బెంజిసర్కిల్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినులు నైపుణ్యాలు పెంచుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మారిస్ స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వాడ్రస్ అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ఆధ్వర్యంలో కృత్రిమ మేధపవర్ బీఐ అనే అంశంపై మూడు రోజులపాటు విద్యార్థినులకు జరిగే శిక్షణ కార్యక్రమం మంగళవారం మారిస్ స్టెల్లా కళాశాలలో ప్రారంభమైంది. ఈశిక్షణ తరగతులను ప్రారంభించిన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థినులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈ జిల్లా కో-ఆర్డినేటర్ మాడగని గురునాథ్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఈ విధంగా శిక్షణ ఇప్పిస్తామని, అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మార్పు ట్రస్ట్ డైరెక్టర్ సుయాజ్, రిసోర్స్‌పర్సన్ రామ్ పాల్గొన్నారు.