Share News

వైభవంగా లంకమ్మ జాతర

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:51 AM

లంకమ్మ అమ్మవారి వార్షిక జాతర కన్నుల పండువగా జరిగింది.

వైభవంగా లంకమ్మ జాతర
ప్రత్యేక వాహనంపై ఊరేగుతున్న లంకమ్మ

అవనిగడ్డ, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): లంకమ్మ అమ్మవారి వార్షిక జాతర కన్నుల పండువగా జరిగింది. వారం రోజులుగా అమ్మవారు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పసుపు, కుంకుమ, చీర సారెలు అందుకుని శనివారం ఉదయం ఆలయానికి చేరుకోవటంతో జాతర ప్రారంభమైంది. మొక్కులు తీర్చుకునేవారు ఘటం బిందెలతో ఆలయానికి ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి ఘటం బిందెలను సమర్పించారు. డీ ఎస్పీ విద్యశ్రీ ఆధ్వర్యంలో సీఐ యువకుమార్‌, ఎస్సై శ్రీనివా్‌సల ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో 7 వేల మందికి అన్నదాన వితరణ చేశారు. ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు (వాసు) పర్యవేక్షించారు.

లంకమ్మను దర్శించుకున్న ప్రముఖులు

లంకమ్మను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ కుమారుడు మండలి వెంకట్రామ్‌, కూటమి నేతలు దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు, లంకమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్‌ బాలభాస్కరావుతో కలిసి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్‌, ఆయన సోదరులు లంకమ్మను దర్శించుకున్నారు.

Updated Date - Apr 13 , 2025 | 12:51 AM