Durga Temple: దుర్గగుడిలో ఉద్యోగుల అంతర్గత బదిలీల్లో మాయాజాలం
ABN , Publish Date - Feb 19 , 2025 | 07:51 AM
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బదిలీ ఉత్తర్వులు చూసి అందరూ నివ్వెరపోయారు. ఎక్కడి వారిని అక్కడే బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.

విజయవాడ: దుర్గగుడి (Durga temple)లో ఉద్యోగుల (Employee) అంతర్గత బదిలీల్లో (Internal Transfers ) మాయాజాలం (Magical ) ప్రదర్శించారు. పనిచేస్తున్న వారిని మళ్లీ అదే స్థానానికి బదిలీ చేసినట్లు ఉత్తర్యులు ఇచ్చి బదిలీల ఉద్దేశాన్ని అధికారులు నీరుగార్చారు. అవే విభాగాలు ఇచ్చినప్పుడు.. ఇక బదిలీ ఉత్తర్వులెందుకంటూ విమర్శలు వస్తున్నాయి. దుర్గగుడి అధికారుల నిర్వాకంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌సీపీ హాయంలో సిఫార్పులతో వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ వార్త కూడా చదవండి..
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బదిలీ ఉత్తర్వులు చూసి అందరూ నివ్వెరపోయారు. ఎక్కడి వారిని అక్కడే బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.
ఎం. దుర్గారావు అనే ఉద్యోగి ప్రస్తుతం స్థలాలు, లీజులు, లీగల్, శివాలయం ఓవరాల్ ఇన్‌చార్జి, పండుగలు, పూజలు నిర్వహిస్తుంటారు. తాజా బదిలీల్లో ఈయనకు మళ్లీ ఇవే బాధ్యతలతో పాటు అదనంగా దత్తత ఆలయాల బాధ్యతలను కూడా అప్పగించారు.; పి.చంద్రశేఖర్ అనే ఉద్యోగి ప్రస్తుతం అన్నదానం, ప్రసాదం తయారీ, శానిటేషన్, వేదపాఠశాల బాధ్యతలు నిర్వహిస్తుండగా.. తాజా బదిలీల్లోనూ మళ్లీ అవే శాఖలు ఇచ్చారు.; పి.సుధారాణి అనే ఉద్యోగిని చీరలు, ఆడిట్ అండ్ జనరల్, అకౌంట్స్, ప్రావిజన్ స్టోర్స్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, తాజా బదిలీల్లో అవే బాధ్యతలతో పాటు అదనంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కల్పించారు.; జె.శ్రీనివాస్ అనే ఉద్యోగి ఎస్టాబ్లిష్‌మెంట్, మెయిన్ టెంపుల్, సబ్ టెంపుల్స్, ట్రస్ట్ బోర్డు, సూపర్‌వైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ, హోంగార్డ్స్ అండ్ సెక్యూరిటీ, అకామిడేషన్, కేశఖండనశాల, ఫస్ట్ ఎయిడ్, ఆర్‌టీఐ యాక్ట్, ధర్మపథం, దత్తత దేవాలయాలు, స్టేషనరీ, ఎంవీ ఫోమ్స్ వంటి బాధ్యతలు చూస్తుండగా కీలకమైన ఎస్టాబ్లిష్‌మెంట్, మెయిన్ టెంపుల్, సబ్ టెంపుల్స్, ట్రస్ట్ బోర్డు బాధ్యతలను తిరిగి కొనసాగించటంతో పాటు అదనంగా కనకదుర్గ ప్రభ బాధ్యతలు అప్పగించారు.
ఎన్.రమేష్‌బాబు అనే ఉద్యోగి ప్రస్తుతం ద్వారకా తిరుమల నుంచి రిలీవ్ అయి రాగా, అకామిడేషన్, సెక్యూరిటీ సూపర్‌వైజేషన్, కేశఖండనశాల, స్టేషనరీ, ఎంవీ ఫోమ్స్, ఆర్టీఐ యాక్ట్ బాధ్యతలు కేటాయించారు. ఎం.శ్రీనివాస్ అనే ఉద్యోగి ప్రస్తుతం అకౌంట్స్, ఐటీ రిటర్న్స్, స్ర్కూట్నీలు, జీఎస్టీ రిటర్న్స్, డౌన్‌హిల్ కౌంటర్స్ సూపర్‌వైజేషన్ బాధ్యతలు చూస్తుండగా, వీటిలో కీలకమైన అక్కౌంట్స్, ఐటీ రిటర్న్స్, స్ర్కూట్నీ బాధ్యతలను కొనసాగిస్తూ అదనంగా మెయిన్ టెంపుల్ బాధ్యతలను చేర్చారు.; బి.ఎస్.జగదీష్ ప్రసాద్ అనే ఉద్యోగి ఎస్టాబ్లిష్‌మెంట్, వేదపాఠశాల బాధ్యతలు నిర్వహిస్తుండగా.. తాజాగా ఎస్టాబ్లిష్‌మెంట్స్, డౌన్‌హిల్ కౌంటర్స్ సూపర్‌వైజేషన్, వేద పాఠశాల బాధ్యతలు అప్పగించారు.; పి.సునీత అనే ఉద్యోగి పెనుగంచిప్రోలు దేవస్థానం నుంచి రిలీవ్ అయి రాగా ఆమెకు అన్న ప్రసాదం బాధ్యతలను కేటాయించారు.; కనకదుర్గ ప్రభ ఎడిటర్‌గా ఉన్న కె.గంగాధర్‌కు మీడియా పీఆర్‌వోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అడ్డుగా వచ్చిన ఎలుగుబంటిని తప్పించబోయి..
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News