Twist.. మూడో పేరును పరిశీలనలోకి తీసుకున్న అధిష్టానం..

ABN, Publish Date - Feb 04 , 2025 | 11:53 AM

నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో ట్విస్ట్.. సోమవారం నుంచి దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న శాకమూరి స్వర్ణలతకు టీడీపీ హై కమాండ్ బీ ఫారం పంపించింది. అయితే ఆ పేరును తాము అంగీకరించబోమని ఎమ్మెల్యే సౌమ్య కౌన్సిలర్లను పక్కను పెట్టుకుని సమావేశానికి రాలేదు.

Twist.. మూడో పేరును పరిశీలనలోకి తీసుకున్న అధిష్టానం..
Nandigama Municipal Chairperson Election

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో (Nandigama Municipal Chairperson Election) ట్విస్ట్ (Twist) నెలకొంది. ఎమ్మెల్యే (MLA), ఎంపీ (MP) వర్గాలు సూచించిన అభ్యర్థులు కాకుండా టీడీపీ (TDP) అధిష్టానం మూడో పేరును పరిశీలనలోకి తీసుకుంది. పార్టీ అభ్యర్థిగా మండవ కృష్ణకుమారికి బీఫారం పంపింది. దీంతో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (MLA Thangirala Soumya)తో మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడారు. అధిష్టానం సూచించిన పేరునే ప్రతిపాదిస్తానని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు. కాగా నందిగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికపై సోమవారం నుంచి తెలుగుదేశంలో సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న శాకమూరి స్వర్ణలతకు టీడీపీ హై కమాండ్ బీ ఫారం పంపించింది. అయితే ఆ పేరును తాము అంగీకరించబోమని ఎమ్మెల్యే సౌమ్య కౌన్సిలర్లను పక్కను పెట్టుకుని సమావేశానికి రాలేదు. దీంతో సమావేశం కోరం లేక వాయిది పడింది.

ఈ వార్త కూడా చదవండి..

డోనాల్డ్ ట్రంప్‌తో పీఎం మోదీ కీలక భేటీ..


నందిగామ మున్సిపల్‌‌లో మొత్తం 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందులో నలుగురు వైఎస్సార్‌సీసీ, 14 మంది టీడీపీ అభ్యర్ధులు ఉన్నారు. వైఎస్సార్‌సీసీ నుంచి కొందరు టీడీపీలోకి రావడంతో టీడీపీ బలం 14కు పిరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ వర్గంగా పేరుగాంచిన స్వర్ణలత పేరును తాము ఆమోదించబోమని, నియోజకవర్గంలో తనకు స్వేచ్ఛ ఇవ్వాలని పేర్కంటూ.. ఆమె మరొక పేరును ప్రతిపాదించారు. ఆ పేరును కూడా హైకమాండ్ అంగీకరించలేదు. ఈ రెండు పేర్లు కాకుండా మండవ కృష్ణకుమారి పేరును కొద్దిసేపటి క్రతమే హైకాంద్ ప్రతిపాదించింది.


కాగా అంతకుముందు పట్టణాభిద్ది శాఖ మంత్రి నారాయణ నందిగామ ఎమ్మెల్యే సౌమ్యతో మాట్లాడారు. దీంతో పాటు నియోజక వర్గం పరిశీలకుడు కనపర్తి శ్రీనివాస్‌ను కూడా అక్కడికి పంపించారు. ఆయన ఖాళీ బి ఫారాన్ని కౌన్సిల్ సమావేశంలోకి పంపారు. దీంతో హైకమాండ్ సూచించిన పేరు మండవ కృష్ణ కుమారి పేరున రాయాలని.. మీ మీద ఉన్న గౌరవంతో ఖాళీ బి ఫారాన్ని హైకమాండ్ పంపిందని.. ఆ పేరును ప్రతిపాదించాలని సూచించారు. దానికి ఎమ్మెల్యే అంగీకారం తెలపడంతో ప్రస్తుతం కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం

శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 04 , 2025 | 12:25 PM