ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada Temple: ఇంద్రకీలాద్రిపై నయా దందా.. వాళ్ల టార్గెట్ ఎవరంటే

ABN, Publish Date - Jan 30 , 2025 | 04:54 PM

Durgamma Temple: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో కొత్తరకం దందా వెలుగులోకి వచ్చింది. అమ్మవారి దర్శనం కల్పిస్తామని మాయ మాటలు చెప్పి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నయా దందాను ఆలయ అధికారులకు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వీఐపీల వద్ద నుంచి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Kanakadurgamma Temple

విజయవాడ, జనవరి 30: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంపై (Vijayawada Kanakadurgamma Temple) మరోసారి దళారుల కన్నుపడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు దళారులు. గతంలో వీల్‌ చైర్లలో, నడవలేని స్థితిలో ఉన్నవారిని, వృద్ధులు, వికలాంగులను బురిడీ కొట్టించి మరీ డబ్బులు వసూలు చేసిన దళారులు తాజాగా కొత్తరకం దందాకు తెరలేపారు. వీరి టార్గెట్ వీఐపీలే. వారికి అమ్మవారి దర్శనం కల్పిస్తామని మాయ మాటలు చెప్పి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నయా దందాను ఆలయ అధికారులకు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వీఐపీల వద్ద నుంచి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా ఆలయంలోని కొందరు సిబ్బంది ఈ దళారులకు సహకరిస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది.


కనకదుర్గమ్మ కొలువై ఉన్న పుణ్యక్షేత్రంలో మరోసారి దళారుల దందా బయటపడింది. దేవస్థానంతో సంబంధం లేని ఓ వ్యక్తి.. భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఆలయ సిబ్బంది గుర్తించారు. డిప్యూటీ శ్రీనివాస్ అనే దేవస్థానానికి సంబంధం లేని వ్యక్తి భక్తుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ ఆలయ అధికారుల కంట పడ్డాడు. కనకదుర్గ నగర్ దర్గా వద్ద కాపుకాసి కారులో దిగిన భక్తులను టార్గెట్ చేసి భక్తుల దగ్గర దర్శనం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డిప్యూటీ శ్రీనివాస్ దందా తెలుసుకున్న దేవస్థానం అధికారులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే


దేవస్థానానికి సంబంధం లేని ఈ వ్యక్తికి దేవస్థానం సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ సపోర్టు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వీఐపీ దర్శనాల కోసం సిబ్బందితో కలిసి శ్రీనివాస్ వసూళ్లకు పాల్పడినట్లు బయటపడింది. దుర్గమ్మ దర్శనం కోసం ఒక్కొక్కరి నుంచి దళారులు రూ.500 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంటనే కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు డిప్యూటీ శ్రీనివాస్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అలాగే శ్రీనివాస్‌‌కు మద్దతుగా నిలిచిన ఆలయ సిబ్బంది ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 04:56 PM