Share News

Sports city: స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు.. భూములు పరిశీలించిన మంత్రి నారాయణ

ABN , Publish Date - Apr 14 , 2025 | 08:50 PM

Sports city: మైలవరం నియోజకవర్గంలో సోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్యే నుంచి స్థానిక నేతల వరకు అంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అందుకు అనువైన స్థలాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సిటీ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Sports city: స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు.. భూములు పరిశీలించిన మంత్రి నారాయణ
Minister P Narayana

విజయవాడ, ఏప్రిల్ 14: రాజధాని అమరావతి నిర్మాణపు పనులు ఊపందుకొంటున్నాయని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటికే 3 వేల మంది కార్మికులు, 500 మెషీన్లు పనులు చేస్తున్నాయని ఆయన వివరించారు. ఏప్రిల్ మాసాంతం నుంచి సుమార 15 వేల మంది రోజు వారీ పనుల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రకటించారు.

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలతోపాటు స్థానిక నేతలు కోరుతున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేలా స్పోర్ట్స్ సిటీ ఉండాలని సీఎం చంద్రబాబు సైతం చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందుకోసం 2 వేల ఎకరాల భూమి అవసరమవుతోందని పేర్కొన్నారు.


కృష్ణా లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందుకోసం.. జల వనరుల శాఖ అధికారులు, కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ కమిటీ నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.


అయితే ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదీ తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలనీ ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు. ఆ క్రమంలో ఇబ్రహీంపటణాన్ని ఆనుకుని ఉన్న కృష్ణా లంక భూములను పరిశీలించాలని మంత్రి నారాయణను ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా కోరారు.

ఈ నేపథ్యంలో వారి కోరిక మేరకు కృష్ణా నదిలో ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల పరిధిలోనీ పెద లంక, చిన లంకలో ఉన్న లంక భూములను జిల్లా కలెక్టర్ లక్షిషా, ఇతర అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. అయితే మూడు కిలోమీటర్లు లంక భూముల్లో కాలి నడకన మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, బోండా ఉమాతోపాటు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మంత్రి నారాయణ విలేకర్లతో మాట్లాడారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Bhu Bharati: భూ భారతిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు

Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..

Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..

New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ

UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 08:50 PM