కౌలు రైతు చట్టంలో మార్పు చేయాలి
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:54 AM
నూతన కౌలురైతు చట్టంలో మార్పు చేయాలని ఏపీ కౌలురైతు సం ఘం కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి పం చకర్ల రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చల్లపల్లి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): నూతన కౌలురైతు చట్టంలో మార్పు చేయాలని ఏపీ కౌలురైతు సం ఘం కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి పం చకర్ల రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు బాపన య్య శ్రామిక భవనంలో చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల కౌలు రైతుసంఘం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రంగారావు పాల్గొన్నారు. భూ యజమానితో సంబంధం లేకుండా కౌలురైతులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు, రైతుభరోసా కల్పించాలన్నారు. మినుము, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. ఉపాధి పథకం కూలీలకు 200 రోజులు పని కల్పించాలనీ, జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు. ఉపాధి కూలీలకు పనిప్రాంతంలో తాగునీరు, షామియానా, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయా సమస్యలపై సమావేశంలో తీర్మానించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం నారాయణరావు, కౌలురైతు సంఘం సహాయ కార్యదర్శి ఎం.సురేష్, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు యద్ధనపూడి మధు, నేతలు వాకా రామచంద్రరావు, మేడంకి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.