వక్ఫ్ భూములపై ఆందోళనొద్దు
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:30 AM
వక్ఫ్ బోర్డు భూముల విషయంలో ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం వక్ఫ్ భూముల రక్షణకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పెనమలూరు మం డలంలోని గోసాల, కంకిపాడు మండలంలోని పునాది పాడు, ఈడుపుగల్లు, గొడవర్రు, కోమటికుంట లాకు గ్రామాలకు చెందిన ముస్లింలు కంకిపాడులో నిర్వహించిన ఈద్ నమాజ్‌లో ఆయన పాల్గొన్నారు.

ఫ ముస్లింలకు అండగా కూటమి ప్రభుత్వం
ఫ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
యనమలకుదురులో ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్ ప్రత్యేక ప్రార్థనలు
కంకిపాడు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : వక్ఫ్ బోర్డు భూముల విషయంలో ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం వక్ఫ్ భూముల రక్షణకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పెనమలూరు మం డలంలోని గోసాల, కంకిపాడు మండలంలోని పునాది పాడు, ఈడుపుగల్లు, గొడవర్రు, కోమటికుంట లాకు గ్రామాలకు చెందిన ముస్లింలు కంకిపాడులో నిర్వహించిన ఈద్ నమాజ్‌లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మా ట్లాడుతూ, వక్ఫ్‌బోర్డు ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అమెండ్మెంట్‌కు వ్యతిరేకంగా పార్ల మెంట్‌లో తమ పార్టీ పోరాడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉన్నా వక్ఫ్ బోర్డు ఆస్తులకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణ యానికి వ్యతి రేకంగా ముస్లింలు నల్ల రిబ్బన్లతో శాతియుతంగా రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, అనుమోలు ప్రభాకర్, కోయా ఆనంద ప్రసాద్, షేక్ మాబు సుబాని, షేక్ బాజ, పఠాన్ కరీముల్లా, పఠాన్ సుబాని, షేక్ అమీర్, మొహమ్మద్ ఆరీఫ్, మొహ్మద్ బేగ్ పాల్గొన్నారు.
యనమలకుదురులో..
పెనమలూరు : పెనమలూరు, విజయవాడ తూ ర్పు నియోజకవర్గాల్లో నివసిస్తున్న ముస్లింలకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హామీ ఇచ్చారు. సోమవారం యనమలకుదురులో పవిత్ర రంజాన పండుగ సం దర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనతో కలిసి పాల్గొని మా ట్లాడారు. వక్ఫ్ భూములను సెంటు కూడా వదిలిపెట్టకుండా కాపాడతామ న్నారు. ఉయ్యూరు పెద్ద మసీదు అభివృద్ధికి సీఎం చంద్రబాబుతో మాట్లాడి రూ. 50 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గోసాలలో రూ. 5 కోట్ల వి లువైన భూమిని ఈద్గా నిర్మాణానికి కేటాయించామన్నారు. ఈడుపుగల్లులో మ సీదు అభివృద్ధికి రూ. 30లక్షలు మం జూరు చేయడం జరిగిందన్నారు. గంగూరులో మూడున్నర కోట్ల ప్రైవేటు భూ మిని ఉచితంగా ముస్లింల అవసరాలకు రిజిస్ర్టేషన చేయడం జరిగిందన్నారు.
జంక్షన్‌లో ముస్లింల నిరసన
హనుమాన్‌జంక్షన్ : ముస్లిం వక్ఫ్ బోర్డులో ముస్ల్లిమేతరులకు స్థానం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న రాజ్యంగ సవరణ బిల్లులను వ్యతి రేకించాలని స్థానిక మజీద్ ఇమామ్ షఫీకుర్ రెహమాన్ తెలిపారు. సోమవారం స్థానిక ఏలూరు రోడ్డులోని ఈద్గా వద్ద రహదారిపై ముస్లింలు రంజాన్ నమాజ్ అనంతరం రాజ్యాంగ సవరణ బిల్లుపై నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహిం చారు. జంక్షన్ నాలుగు రోడ్లు మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్ రెహమాన్, స్థానిక మదీన మజీద్ కమిటీ గౌరవ అధ్యక్షుడు అబ్దుల్ బారీ మాట్లాడుతూ, వక్ఫ్‌బోర్డులో ఇతర మతస్తులకు స్థానం కల్పించడం అన్యాయమన్నారు. స్థానిక ముస్లిం నాయకులు సయ్యద్ జానీ, షేక్ జానీ, మసీదు నిర్వాహాకులు పాల్గొన్నారు.