‘బీజేపీని బలోపేతం చేయాలి’
ABN, Publish Date - Mar 24 , 2025 | 12:16 AM
సంస్థాగత ఎన్నికలకు బీజేపీ బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్ అన్నారు.

నంద్యాల కల్చరల్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): సంస్థాగత ఎన్నికలకు బీజేపీ బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్ అన్నారు. నంద్యాలలో ఆదివారం జిల్లా స్థాయి సంస్థాగత సమావేశం నంద్యాలలోని నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధుకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. విజయవాడ ఇన్‌చార్జి అడ్వకేట్ నరసింగరావు, నంద్యాల జిల్లా ఇన్‌చార్జి పోతుగంటి రమేష్ నాయుడు, వెంకట శివనారాయణ, మోమిన్ షబానా, కశెట్టి కృష్ణమూర్తి, మేడా మురళీధర్, మండలాల అధ్యక్షులు, సభ్యులు, క్రియాశీల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 24 , 2025 | 12:16 AM