Share News

శ్రీమఠంలో రథోత్సవం

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:13 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజత రథంపై విహరించారు.

శ్రీమఠంలో రథోత్సవం
భక్తులతో రద్దీగా ఉన్న శ్రీమఠం ప్రాంగణం

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు

మంత్రాలయం, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజత రథంపై విహరించారు. ఆదివారం రాత్రి శ్రీరామనవమి శభదినాన్ని పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులతో అర్చకులు బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బృందావ నాన్ని బంగారు, వెండి, పట్టు వసా్త్రలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయ మానంగా అలంకరించారు. అనంతరం రజత రథాన్ని వివిధ పుష్పాల తో చూడ ముచ్చటగా అలంకరించి, వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రహ్లాదరాయలను అధిష్ఠించి పీఠాధిపతి మహామంగళహారతులు ఇచ్చి ఆలయ ప్రాంగణ ం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజల మంటపంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అధి ష్ఠించి ఊంజలసేవ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మం ది భక్తులు తరలిరావడంతో మంత్రాలయం పురవీధులన్నీ కిక్కిరి సిపోయాయి.

Updated Date - Apr 07 , 2025 | 01:13 AM