దివ్యాంగుల అవస్థలు
ABN, Publish Date - Mar 13 , 2025 | 12:56 AM
నంద్యాల జీజీహెచ్‌లో జరుగుతున్న సదరం క్యాంప్‌లో సర్టిఫికెట్ల పరిశీలన కోసం వస్తున్న దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు.

నంద్యాల హాస్పిటల్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జీజీహెచ్‌లో జరుగుతున్న సదరం క్యాంప్‌లో సర్టిఫికెట్ల పరిశీలన కోసం వస్తున్న దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం జారీచేస్తున్న నోటీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొదట ఈ నెల 11న హాజరు కావాలని, తిరిగి 12వ తేది వెళ్లాలని నోటీస్ జారీ చేశారు. అంతకుముందే 12వ తేదీ వెళ్లేవారికి నోటీసులు జారీచేశారు. దీంతో బుధవారం నంద్యాల జీజీహెచ్‌కు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 11, 12తేదీల్లో నోటీసులు ఇచ్చినవారు వచ్చారు. జీజీహెచ్‌లో బుధవారం పరిశీలించాల్సినవారి సంఖ్య ఎక్కువ కావడంతో వచ్చిన దివ్యాంగులు టోకెన్ దొరక్కపోవడంతో కొందరు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బనగానపల్లె నియోజకవర్గంలోని దివ్యాంగులకు ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రణాళికలో భాగంగా 12వ తేది హాజరుకమ్మని ఇచ్చిన నోటీసు వారికే ప్రాధాన్యమిస్తూ మూగ, చెవిటి విభాగంలో 60మందికి మాత్రమే టోకెన్లు జారీచేశారు. మిగిలినవారికి టోకెన్లు అడగ్గా ప్రస్తుతానికి టోకెన్లు జారీ చేయడం అయిపోయిందని సమాధానం ఇవ్వడంతో దివ్యాంగులు వెనుదిరిగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మండల పరిషత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నోటీసు జారీ విషయంలో సరైన పద్ధతి పాటించి ఉంటే ఇలాంటి తిప్పలు ఉండేవికావని దివ్యాంగులు వాపోయారు.
Updated Date - Mar 13 , 2025 | 12:56 AM