నిత్యాన్నదాన పథకానికి విరాళం
ABN, Publish Date - Mar 16 , 2025 | 01:26 AM
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శనివారం విజయవాడకు చెందిన పీఆర్‌ఎల్ ప్రసాద్ అనే భక్తుడు కుటుంబ సమేతంగా రూ.5,00,000 విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందజేశారు.
దాతకు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేస్తున్న ఏఈవో
శ్రీశైలం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శనివారం విజయవాడకు చెందిన పీఆర్‌ఎల్ ప్రసాద్ అనే భక్తుడు కుటుంబ సమేతంగా రూ.5,00,000 విరాళాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములుకు అందజేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, స్వామి,అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.
Updated Date - Mar 16 , 2025 | 01:26 AM