ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులను నిర్లక్ష్యం చేయొద్దు: ఎమ్మెల్యే

ABN, Publish Date - Jan 03 , 2025 | 12:55 AM

రైతు సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

తెలుగుగంగ అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుడ్డా

వెలుగోడు, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రైతు సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం ఆయన వెలుగోడు జలాశయానికి అనుసంధానంగా వన్‌ఆర్‌ తూమ్‌ను తెలుగుగంగ అధికారులతో కలిసి పరిశీలించారు. వన్‌ఆర్‌ తూమ్‌ గేటు పని చేయకపోవడంతో సాగునీటి సమస్య తలెత్తడంతో రైతులు ఎమ్మెల్యేని కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. దీంతో ఆయన స్వయంగా జలాశయం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను అధికారులు సత్వరమే పరిష్కరించాలని అన్నారు. తూముకు సంబంధించిన ఉక్కు పిన్ను ఉడిపోవడంతో గేటు మరమ్మతులకు గురైందని గంగ అధికారులు తెలిపారు. తూము సైతం 14 అడుగుల లోతులో నీటిలో ఉండటంతో మరమ్మతులకు కష్టంగా ఉందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నిపుణులను రప్పించి మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని సూచించారు. లేనిపక్షంలో వరి నారుమళ్లు ఎండిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో అధికారులు తూము మరమ్మతుల కోసం నిపుణులను రప్పించేందుకు ప్రయత్నాలు సాగించారు. ఎమ్మెల్యే వెంట కేసీ కెనాల్‌ ప్రాజెక్ట్‌ కమిటీ అధ్యక్షుడు బన్నూరు రామలింగారెడ్డి, మాజీ సర్పంచ్‌ కలాం, నాయకులు శంకరరెడ్డి, ఎల్లాల కృష్ణుడు, రసూల్‌, జాకీర్‌హుసేన్‌, సూర్యనారాయణ, రాజశేఖర్‌, తెలుగుగంగ ఈఈ శంకరరెడ్డి, డీఈ బాపూజీ, జేఈ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 12:55 AM