ముగిసిన చర్చి వార్షికోత్సవం
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:21 AM
నంద్యాల సాయిబాబానగర్‌లో గిప్సన్ కాలనీలో కొలువైన తెలుగు బాప్టిస్టు చర్చి 57వ వార్షిక వేడుకలు ఆదివారం ముగిశాయి.

ప్రార్థనలో పాల్గొన్న క్రైస్తవులు
నంద్యాల కల్చరల్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): నంద్యాల సాయిబాబానగర్‌లో గిప్సన్ కాలనీలో కొలువైన తెలుగు బాప్టిస్టు చర్చి 57వ వార్షిక వేడుకలు ఆదివారం ముగిశాయి. చర్చి పాస్టర్ సీహెచ్ విజయభాస్కర్ దైవ సందేశం ఇచ్చారు. వార్షికోత్సవంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు, దైవ ఆరాధనలు, భక్తి పాటలు, చిన్నారులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు బాప్టిస్టు చర్చి ప్రెసిడెంట్ రాజు ఇమ్మానియేల్, కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి కృపవరం, కార్యవర్గ సభ్యులు సాల్మన్‌రాజు, ఆనంద్, సుఽధీర్ కుమార్, చర్చి సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:21 AM