సారా నిర్మూలనకు అందరూ సహకరించాలి: ఎస్పీ
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:25 PM
సారా నిర్మూలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, నిర్మూలనకు అందరూ సహకరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు.

కర్నూలు అర్బన్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): సారా నిర్మూలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, నిర్మూలనకు అందరూ సహకరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. జిల్లా ఎక్సైజ్ ఈఎస్ సుధీర్‌బాబు, సీఐలు చంద్రహాస్, రాజేంద్ర ప్రసాద్ నవోదయం ఎన్‌ఫోర్స్‌మెంట్ పోస్టర్‌ను ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ నాటుసారా రహిత జిల్లాగా తయారు చేయడమే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. నవోదయం రెండో దశలో ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్టివిటీస్‌పై అవగాహన, దాడులు విస్తృతం చేయడమే ప్రక్రియలో పోలీసుల ప్రాత్ర కూడా కీలకంగా ఉంటుందని తెలిపారు. ఈఎస్ సుధీర్ బాబు మాట్లాడుతూ నవోదయం అమలు దశ, జిల్లా స్థాయిలో కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్‌నెస్ అండ్ రెస్పాన్స్ గురించి ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో టౌన్ డీఎస్సీ బాబు ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.