Share News

స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలు

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:37 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలు
స్వర్ణ రథంపై విహారిస్తున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. చైత్రమాస షష్టి, రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన గురువారం శుభదినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారికి క్షీరాభిషేకం, విశేష పంచామృతాభిషేకం చేసి వెండి, బంగారు, పట్టు వస్ర్తాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వర్ణ రథంపై వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణ ం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవలో భాగంగా ఉత్సవ మూర్తిని ఊయలలో ఉంచి ఊరేగించారు. రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో సందడిగా మారింది. గురువారం రాఘవేంద్రస్వామికి ఇష్టమైన దినం కావటంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Apr 04 , 2025 | 12:38 AM