Share News

ఆదివాసులపై యుద్ధం నిలిపివేయాలి

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:29 AM

భారత సైన్యం ఛత్తీ్‌సఘడ్‌లో ఆదివాసులపై చేస్తున్న యుద్ధాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ ముందు ఆదివాసుల హత్యలకు, ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు

ఆదివాసులపై యుద్ధం నిలిపివేయాలి
కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేస్తున్న నాయకులుట

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): భారత సైన్యం ఛత్తీ్‌సఘడ్‌లో ఆదివాసులపై చేస్తున్న యుద్ధాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ ముందు ఆదివాసుల హత్యలకు, ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. కన్వీనర్‌ అల్లాబకాష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజా అభ్యుదయ సంస్థ నాయకుడు భార్గవ మాట్లాడుతూ నేడు ఛత్తి్‌సఘడ్‌లో అన్ని అధికా రాలను సైన్యం గుప్పిట్లోకి తీసుకుందని, కార్పొరేట్‌ కంపెనీల కోసం ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. విరసం బాధ్యుడు పాణి మాట్లాడుతూ తక్షణమే భారత ప్రభుత్వం సైన్యాన్ని వెనక్కి తీసుకొని, యుద్ధాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకుడు సుంకన్న, కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు సుబ్బారాయుడు, పోస్టల్‌ యూనియన్‌ నాయకులు మల్లేశ్వరరెడ్డి, యోహాను, రాయలసీమ విద్యావంతుల వేదిక బాధ్యుడు రత్నం ఏసేపు తదితరులు మాట్లాడారు.

Updated Date - Apr 04 , 2025 | 12:29 AM