Kurnool Holi tradition: మగాళ్లంతా ఆడవారిలా మారిపోతారు.. అదో వింత ఆచారం

ABN, Publish Date - Mar 14 , 2025 | 01:53 PM

Kurnool Holi tradition: హోలీ సంబరాలను ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఏళ్లుగా వారి ఆచారాలను పాటిస్తూ హోలీ వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు.

Kurnool Holi tradition: మగాళ్లంతా ఆడవారిలా మారిపోతారు.. అదో వింత ఆచారం
Kurnool Holi tradition

కర్నూలు, మార్చి 14: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అంతా కలిసి హోలీ పండుగను (Holi Festival) ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. రంగుల హేలీ హోలీ. కొన్ని చోట్ల డీజే పాటలు పెట్టుకుని రంగులు చల్లుకుంటూ ఆడిపాడుతారు. అయితే హోలీ పండును కొన్ని చోట్ల ఒక్కో రకంగా జరుపుకుంటున్నారు. పలు చోట్ల వింత ఆచారాలు కూడా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆచారాలను పాటిస్తూ ఆయా గ్రామాల్లో హోలీ సంబరాలను జరుపుకుంటారు ప్రజలు. ఇదే విధంగా కర్నూలు జిల్లాలోనూ (Kurnool District) ఓ వింత ఆచారం ఉంది. ఆ గ్రామంలో రెండు రోజుల పాటు ఈ ఆచారాన్ని పాటిస్తూ హోలీని జరుపుకుంటారు. ఇంతకీ ఏంటా ఆచారం... ఏమిటా కథ.. ఇప్పుడు తెలుసుకుందాం.


కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో హోలీ పండుగ వేడుకల్లో వింత ఆచారాన్ని కొనసాగిస్తుంటారు. గ్రామంలోని మగవాళ్లంతా ఆడవాళ్ల వేషాల్లోకి మారిపోతారు. చాలా విచిత్రమైన ఆచారంతో అక్కడి ప్రజలు పండుగను జరుపుకుంటారు. మగవారంతా మహిళ వేషధారణలో రతి మన్మధుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దశాబ్దాలుగా గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ హోలీ పండుగ జరుపుకోవడం విశేషం. అక్కడ పురుషులు ఆడవారి వేషధారణలో మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో కరువు, కాటకాలు రావని అక్కడి స్థానికుల నమ్మకం. కరువు, కాటకాలు రాకుండా ఉండాలంటే ఆ గ్రామంలో పురుషులంతా చీర కట్టడం తప్పదు మరి.

Navami controversy: నవమి మహోత్సాల వేళ అనూహ్య పరిణామం


మగవారంతో ఆడవారిలాగా చీరలు కట్టుకుని, ఆభరణాలు పెట్టుకుని అమ్మాయిల మాదిరిగా రెడీ అవుతారు. ఇలా చేయడం వల్ల కోరిక కోరికలు తీరుతాయని అక్కడి వారు బలంగా నమ్ముతారు. మరోవైపు ఇక్కడి వింత ఆచారాన్ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తుంటారు. అంతే కాకుండా వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారు కూడా మగవాళ్లంతా ఆడవారి వేషధారణలోకి మారిపోయి రతీమన్మధుడికి పూజిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందనే వారి విశ్వాసం. ఇలా ప్రతీ ఏడాది కూడా రెండు రోజుల పాటు మగవారంత కూడా మహిళల వేషధారణలో పూజలు చేస్తుండటమే అక్కడి ప్రత్యేకత.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 14 , 2025 | 01:55 PM