Share News

వైభవంగా వీరభద్రస్వామి రథోత్సవం

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:08 AM

మండలంలోని కైరుప్పల గ్రామంలోని భద్రకాళి వీరభద్ర స్వామి రథోత్సవం వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వైభవంగా వీరభద్రస్వామి రథోత్సవం
కైరుప్పల వీధుల్లో సాగుతున్న వీరభద్ర స్వామి రథోత్సవం

ఆస్పరి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కైరుప్పల గ్రామంలోని భద్రకాళి వీరభద్ర స్వామి రథోత్సవం వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవంలో భాగంగా జరిగిన వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం భద్రకాళి వీరభద్ర స్వామి ఉత్సవమూర్తులను రథంపై ఉంచి ఊరేగించారు. కైరుప్పుల గ్రామ ప్రజలతోపాటు సమీప గ్రామాలైన పుప్పాల దొడ్డి, కారుమంచి, కలపరి, చెన్నంపలి, వెంగళాయిదొడ్డి, కోటకొండ, ములుగుందం, బిలేకల్‌ అలాగే సమీప గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రథోత్సవ వేడుకలను తిలకించారు. కార్యక్రమంలో వీరప్రసాద్‌ బాబు, శేషి రెడ్డి, సర్పంచ్‌ తిమ్మక్క, రామకృష్ణ, బీటెక్‌ వీరభద్ర, పూజారి మహేష్‌, బసవరాజు, శేషాద్రి నాయుడు, మదు, రాఘవరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:08 AM