Sathya Sai District: ఈ తాగుబోతు మామూలోడు కాదు.. ఏకంగా బస్సు కింద దాక్కుని..
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:57 PM
ఓ తాగుబోతు చేసిన పనికి ఆర్టీసీ బస్ డ్రైవర్ గుండెలు జల్లుమన్నాయి. అంతలా ఆ తాగుబోతు డ్రైవర్‌ను భయపెట్టేశాడు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు సమాచారం ఇవ్వకపోయి ఉంటే ఆ తాగుబోతు ప్రాణాలు రిస్క్‌లో పడేవి..

మందు బాబులం మేము మందు బాబులం .. మందు కొడితే మాకు మేమే మహారాజులం.. గబ్బర్ సింగ్ సినిమాలో తాగుబోతుల ప్రవర్తన గురించి చెబుతూ ఈ పాట సాగుతుంది. కొంతమంది తాగిన తర్వాత ఈ ప్రపంచానికి తామే మహారాజులం అన్నట్లు ఫీలవుతుంటారు. ఇంకా కొంతమంది ‘ మాకు మరణం లేదు’ అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఇష్టం వచ్చినట్లు చేస్తుంటారు. తాగు బోతుల వింత ప్రవర్తనకు సంబంధించి సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూసే జనాలు కూడా పవర్ ఆఫ్ 90 ఎమ్‌ఎల్ అంటూ కామెంట్లు కూడా చేస్తుంటారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఓ తాగుబోతు తల తిక్క పని చేశాడు. ఏకంగా బస్సు కింద దాక్కుని ప్రయాణం చేశాడు. అది కూడా ఒక కిలోమీటర్ రెండు కిలో మీటర్లు కాదు.. ఏకంగా 15 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. గూండా సినిమాలో చిరంజీవి రైలు కింద వేలాడుతూ ప్రయాణం చేసినట్లు చేశాడు.
కొత్త చెరువు టు హిందూపురం..
శనివారం సత్యసాయి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి కొత్త చెరువు నుంచి హిందూపురం వెళుతున్న బస్సు దగ్గరకు వచ్చాడు. మరి, డబ్బులు లేవో .. లేక సరదా కోసమో తెలీదు కానీ.. బస్సు కింద ఉన్న స్పేర్ టైరుపై పడుకున్నాడు. బస్సు కదిలినా కిందకు దిగలేదు. దాన్ని అలాగే గట్టిగా కరుచుకుని పడుకున్నాడు. దాదాపు 15 కిలోమీటర్లు బస్సు కింద వేలాడుతూ ప్రయాణం చేశాడు. 15 కిలోమీటర్ల తర్వాత ఆ తాగుబోతును కొంత మంది వాహనదారులు గమనించారు. వెంటనే బస్ డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. డ్రైవర్ బస్సు ఆపేశాడు. బస్సు కింద వేలాడుతున్న ఆ వ్యక్తిని కిందకు దించేశాడు. వాహనదారులు చూసి డ్రైవర్‌కు చెప్పకపోయి ఉంటే.. పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఏమాత్రం అటు ఇటు అయినా ఆ వ్యక్తి ప్రాణాలు పోయేవి. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు.
రైలు చక్రాల మధ్య దాక్కుని 250 కి.మీ ప్రయాణం..
గతంలో ఓ వ్యక్తి రైలు చక్రాల కింద దాక్కుని ఏకంగా 250 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. రైలు చక్రాల యాక్సిల్ దగ్గర దాక్కుని జబల్‌పూర్ వరకు ప్రయాణం చేశాడు. టికెట్ తీసుకోవడానికి డబ్బులు లేకపోవటం వల్ల ఆ వ్యక్తి ఇంత సాహసానికి ఒడిగట్టాడు. అతడు రైలు కింద దాక్కుని ప్రయాణం చేస్తున్న టైంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ వీడియో రైల్వే శాఖ అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దానిపై విచారణ చేపట్టగా అది నకిలీ వార్త అని తేలింది. రైలు చక్రాల యాక్సిల్ దగ్గరనుంచి బయటకు వస్తున్న వ్యక్తిని వీడియో తీశారని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తి రైలు కింద దాక్కుని 250 కిలోమీటర్లు ప్రయాణించాడన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: రేకుల షెడ్డుపై రీల్ చేసింది.. చివరకు జరిగింది చూసి ఖంగుతింది..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..