Share News

Nimmala Ramanaidu : ఆ ట్వీట్‌ జగన్‌ నేర స్వభావాన్ని చాటుతోంది

ABN , Publish Date - Feb 15 , 2025 | 06:32 AM

‘వంశీలాంటి వ్యవస్థీకృత నేరగాడిని సమర్థిస్తూ జగన్‌ ట్వీట్‌ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోంది.

 Nimmala Ramanaidu : ఆ ట్వీట్‌ జగన్‌ నేర స్వభావాన్ని చాటుతోంది

  • దళితులు, మహిళలంటే ఆయనకు చిన్నచూపు: మంత్రి నిమ్మల

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ‘వంశీలాంటి వ్యవస్థీకృత నేరగాడిని సమర్థిస్తూ జగన్‌ ట్వీట్‌ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోంది. దళితులు, మహిళలంటే జగన్‌కు చిన్నచూపు. వారికన్నా వంశీలాంటి రౌడీలు జగన్‌కు ఎక్కువయ్యారా? తప్పుని తప్పని ఖండించకపోగా సమర్థించడం ఏమిటి?’ అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ‘దళిత బిడ్డను బెదిరించి సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి వంశీ కుట్రపన్నారు. ఇంత బరితెగించిన వ్యక్తిని జగన్‌ ఎలా సమర్థిస్తారు? ఇకపై వైసీపీ నాటి అరాచకాలు పునరావృతం కానివ్వబోం’ అని నిమ్మల స్పష్టం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని జగన్‌ అనడం హాస్యాస్పదం. టీడీపీ కార్యాలయంపై దాడులు చేసిన వారి విషయంలో చట్టప్రకారం నడుచుకుంటున్నాం. నేరగాళ్లను సమర్థించడం జగన్‌ నైజాన్ని బయటపెట్టింది. అధికారంలో ఉన్నా లేకున్నా దళితులను వైసీపీ వారు టార్గెట్‌ చేయడం దారుణం’ అని పల్లా అన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 06:32 AM