ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మోదీ ఉపాధి.. బాబు చేయూత: పురందేశ్వరి

ABN, Publish Date - Apr 01 , 2025 | 06:11 AM

ప్రధాని మోదీ దేశంలో కోటి మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని పేదలకు ధనికుల చేయూత అందించాలని కోరుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. విజయవాడలో బీజేపీ సమావేశంలో పార్టీ కార్యాచరణపై ఆమె నేతలకు దిశా నిర్దేశం చేశారు

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ‘దేశంలో కోటి మందికి ఊపాధి చూపాలని టాప్‌ 500 కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రంలోని పేదలకు ధనికులు చేయూత అందించాలని సీఎం చంద్రబాబు కోరుతున్నారు. ఇది దేశంలోని యువతకు, రాష్ట్రంలోని పేదలకు వరం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లాల నూతన అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో సంస్థాగత అంశాలు-రాజకీయ కార్యాచరణపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ... ‘ఏడాది క్రితం వరకూ రాష్ట్రంలో విద్వేషం, విధ్యంసం మాత్రమే కనిపించేవి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీకి భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించేది. కానీ డబులింజన్‌ సర్కార్‌ వల్ల కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. రహదారులకు కొత్త రూపు వచ్చింది. మోదీ, బాబు, పవన్‌ సమన్వయంతో పోలవరం, అమరావతి నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పార్టీ నేతలకు పురందేశ్వరి దిశా నిర్దేశం చేశారు.

Updated Date - Apr 01 , 2025 | 06:11 AM