Share News

Palla Srinivas Rao: మహానాడు విజయవంతం కావాలని పల్లా పూజలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 04:13 AM

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కడపలో నిర్వహించనున్న మహానాడు విజయవంతం కావాలని గుజరాత్‌లోని ద్వారకా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహానాడు టీడీపీ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు

Palla Srinivas Rao: మహానాడు విజయవంతం కావాలని పల్లా పూజలు

కడపలో నిర్వహించనున్న మహానాడు టీడీపీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గుజరాత్‌లోని ద్వారకాలో ద్వారకాధీశుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ద్వారక ఆలయానికి వెళ్లిన ఆయన మహానాడు విజయవంతం కావాలని పూజలు చేశారు.

Updated Date - Apr 16 , 2025 | 04:13 AM