Tribal Welfare: దార్శనికుడు మోదీ : డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:05 AM
పవన్ కల్యాణ్ ప్రధాని మోదీని దార్శనికుడిగా ప్రశంసిస్తూ, గిరిజనుల జీవితాలను మెరుగుపరచేందుకు మోదీ చేపట్టిన చర్యలపై అభినందనలు తెలిపారు. పీఎంజీఎ్‌సవై, ఎన్‌ఆర్‌జీఎ్‌సతో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం మరియు కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలు సమాజంలో మార్పు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమరావతి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ దార్శనికుడని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ‘దుర్బల గిరిజనల జీవితాలను ఉద్ధరించడానికి మీ దార్శనిక నిబద్ధతకు అడవి తల్లిబాట ప్రతిబింబం. గిరిజనుల అవసరాలను తీర్చడానికి మీరు తీసుకున్న చర్యల్లో ఇది ఒకటి. వారి జీవితాలను మార్చడానికి మీరు చేసే విస్తృత ప్రయత్నాల్లో ఇది కీలకమైన భాగం. పీఎంజీఎ్‌సవై, ఎన్‌ఆర్‌జీఎ్‌సల మద్ధతుతో రూ.1005 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 1069 కి.మీ రోడ్లను నిర్మిస్తున్నాం. 601 పీవీటీజీ ఆవాసాల్లో కనెక్టివిటీ సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఈ పథకాలు గిరిజన ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తాయి. పర్యాటకానికి మద్ధతు ఇస్తుంది, సకాలంలో వైద్య సదుపాయాన్ని అందిస్తుంది. సమాజంలో ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక డోలీ కష్టాలకు ముగింపు పలుకుతుంది’ అని ‘ఎక్స్’లో ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News