Crime News: దారుణం.. కన్న కొడుకును ముక్కలు ముక్కలుగా నరికి.. ఏం చేసిందంటే..
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:10 PM
ఓ కసాయి తల్లి కన్న కొడుకును కడతేర్చింది. ఈ దారుణమైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కన్న కొడుకు శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి..

ప్రకాశం జిల్లా : కంభం తెలుగు వీధిలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకు కదం శ్యామ్ (35) ని ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేయించింది ఓ కశాయి తల్లి సాలమ్మ. అనంతరం మేదర్ బజారు సమీపంలోని పంట కాలువ ప్రాంతంలో శరీర భాగాలను మూడు గోనె సంచులలో పెట్టి పడేసినట్లు తెలుస్తోంది.
తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్‌తో కలిసి తన తమ్ముడిని హత్య చేయించారని శ్యామ్ అన్న సుబ్రమణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆస్తి వివాదం నేపథ్యంలోనే శ్యామ్‌ను హత్య చేశారని అనుమానిస్తున్నారు. శ్యామ్ శరీర భాగాలను గుర్తించి దర్యాప్తు చేపట్టారు. తల్లి సాలమ్మను, ఆటో డ్రైవర్ మోహన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.