Share News

TDP Workers: మంత్రి ఎదుటే బాహాబాహీ

ABN , Publish Date - Apr 09 , 2025 | 06:04 AM

పులివెందులలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో రెండు వర్గాల మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. బీటెక్ రవి, శేషారెడ్డి మధ్య ఘర్షణ జరగడంతో మంత్రి సవిత మరియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వారిని హెచ్చరించారు

TDP Workers: మంత్రి ఎదుటే బాహాబాహీ

  • ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డిపై దాడికి యత్నం

  • పులివెందులలో టీడీపీ వర్గాల ఘర్షణ

పులివెందుల, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): పులివెందులలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత ఎదుటే టీడీపీలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మంగళవారం ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్లో జరిగింది. సమావేశం ప్రారంభమవుతుండగా.. వేములకు చెందిన పార్టీ నాయకుడు పార్థసారథిరెడ్డి తమ్ముడు శేషారెడ్డి (బీటెక్‌ రవి వర్గం) ఒక్కసారిగా.. వేదికపై ఉన్న ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డిపై దాడికి యత్నించారు. క్షణాల్లోనే ఇరువర్గాల కార్యకర్తలు వేదికపైకి దూసుకొచ్చి పెద్దఎత్తున ఈలలు, కేకలు వేయడంతో గందరగోళం నెలకొంది. తోపులాట కూడా జరిగింది. దీంతో వేదికపైన ఉన్న వారందరూ దిగిపోవాలని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మంత్రి సవిత గట్టిగా చెప్పారు. ఇలాంటి చర్యలు పార్టీకో, చంద్రబాబుకో నష్టం కలుగజేయవని.. మీరే నష్టపోతారని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. దీంతో గొడవ సద్దుమణిగి సమావేశం ప్రారంభమైంది. జరిగిన చిన్నపాటి ఘర్షణకు ఎవరి మనసైనా నొచ్చుకుని ఉంటే ఉంటే క్షమాపణ కోరుతున్నానని బీటెక్‌ రవి అన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 06:07 AM