Share News

Road Construction: వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:14 AM

విశాఖపట్నం మాస్టర్‌ప్లాన్‌ రోడ్ల నిర్మాణానికి రూ.154.60 కోట్లు మంజూరు చేయబడ్డాయి. 26.72 కి.మీ రోడ్ల నిర్మాణం కోసం మున్సిపల్‌ శాఖ చర్యలు చేపట్టింది. ఈ పనులను ఏడు రోడ్లుగా ఒకే ప్యాకేజీగా చేపట్టేందుకు నిర్ణయించారు.

Road Construction: వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లకు మహర్దశ

26.72 కి.మీల రోడ్లకు రూ.154.60 కోట్లు!

7 రోడ్లు మంజూరుకు మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు

అమరావతి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ ప్రాంతీయ అభివృద్ధి అథారిటీ పరిధిలో పలు మాస్టర్‌ప్లాన్‌ రోడ్లకు మహర్దశ పట్టింది. 26.72 కి.మీల రోడ్ల నిర్మాణాలకు రూ.154.60 కోట్లు మంజూరు చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో మాస్టర్‌ప్లాన్‌కు కనెక్ట్‌ అవుతున్న ముఖ్యమైన రోడ్ల పనులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సమీక్షలో అధికారులను ఆదేశించారు. ఏడు రోడ్లను ఒకే ప్యాకేజీ కింద ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) విధానంలో చేపట్టాలని మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.సురే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. విజయనగరం చిప్పాడ డివిజన్‌ రోడ్డు సర్వే నం.48 నుంచి విశాఖపట్నం చిప్పాడ డివిజన్‌ రోడ్డు సర్వే నెం.140 వరకు, పోలిపల్లి సర్వే నంబర్‌ 304 వరకు 24 మీటర్ల వెడల్పుతో 6.32 కి.మీ రోడ్డును రూ.37.92 కోట్ల అంచనాతో నిర్మించనున్నారు. అదే విధంగా నేరెళ్లవలస సర్వే 8 నుంచి కొత్తవలస దొరతోట మీదుగా తాళ్లవలస సర్వే నంబర్‌ 161 వరకు 4 కి.మీ రోడ్డును రూ.24 కోట్లతోను, బోయళ్లపాలెం జంక్షన్‌ వద్ద పరదేశీపాలెం సర్వే నంబర్‌ 11 నుంచి మంగమ్మారిపేట జంక్షన్‌ కాపులుప్పాడ సర్వే నంబర్‌ 302 వరకు 3.10 కి.మీ రోడ్డును రూ.7.46 కోట్లతోను, గంభీరం సర్వే నంబర్‌ 125 నుంచి ఎన్‌హెచ్‌-16 గంభీరం సర్వే నంబర్‌ 63 వరకు 2.20 కి.మీ రోడ్డును రూ.11.97 కోట్లతో, పరదేశీపాలెం ఏహెచ్‌-26 సర్వే నంబర్‌ 1 నుంచి గంభీరం సర్వే నంబర్‌ 125 వరకు 1.40 కి.మీ రోడ్డును రూ.5.60 కోట్లతో, జీవీఎంసీకు సంబంధించి శివశక్తి నగర్‌ 18మీటర్ల వెడల్పు రోడ్డు నుంచి హరిత ప్రాజెక్టు ఉడా 30మీటర్ల వెడల్పు రోడ్డు వరకు 1.70 కి.మీ రోడ్డును రూ.7.63 కోట్లతో, ఆర్‌అండ్‌బీ రోడ్డుకు సంబంధించి బీఆర్‌టీఎస్‌ సొంట్యాం రోడ్డు జంక్షన్‌ వద్ద అడివివరం జంక్షన్‌ నుంచి గండిగుండం ఎన్‌హెచ్‌ జంక్షన్‌ వరకు 8 కి.మీ రోడ్డును రూ.60 కోట్లతోను మొత్తం 26.72 కి.మీ రోడ్లకు రూ.154.60 కోట్లు మంజూరుచేస్తూ మున్సిపల్‌శాఖ ఆదేశాలిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:14 AM