RP Thakur Role: సలహాదారు ఆర్‌పీ ఠాకూర్‌కు విధులు కేటాయింపు
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:16 AM
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆర్పీ ఠాకూర్‌కు రాష్ట్ర విభజన, మావోయిస్టు సమస్యలు, డ్రగ్స్ నిర్మూలన వంటి కీలక బాధ్యతలు కేటాయించారు. నెలకు రూ.2.5 లక్షల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్పీ ఠాకూర్ విధులు, జీతభత్యాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విభజన సమస్యలు, మావోయిస్టు వ్యవహారాలు, కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రాలకు కేటాయించే నిధులు, రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు కేంద్ర సంస్థలతో సహకారం తదితర బాధ్యతలు నిర్వర్తించాలని మంగళవారం విడుదల చేసిన జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో విధులు నిర్వర్తించే ఠాకూర్‌కు నెలకు రూ.2.5లక్షల జీతంతోపాటు ఇంటి అద్దె నెలకు రూ.లక్ష, కారు, డ్రైవర్లు, ఇతర అలవెన్సులు, కార్యాలయం, ఐదుగురు ఉద్యోగుల్ని కేటాయించింది. రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.