Sankranti Travel : 5 లక్షల మంది రాక
ABN, Publish Date - Jan 14 , 2025 | 03:06 AM
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు రికార్డు స్థాయిలో ప్రజలు ప్రయాణాలు చేశారు.
సంక్రాంతికి హైదరాబాద్ నుంచి బెజవాడకు వచ్చిన వారి సంఖ్య!
రికార్డు స్థాయిలో ప్రయాణాలు
(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు రికార్డు స్థాయిలో ప్రజలు ప్రయాణాలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఆర్టీసీ, టోల్ ప్లాజాల గణాంకాలు చెబుతున్నాయి. గత సంక్రాంతికి ఒక్క హైదరాబాద్ నుంచే మూడు లక్షల మంది రాగా, ఈ సారి ఆ సంఖ్య ఐదు లక్షలకు చేరింది. ఇంత భారీ సంఖ్యలో తరలిరావటానికి పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగులకు 19వ తేదీ వరకు సెలవులు రావడమే కారణంగా తెలుస్తోంది. ఈసారి చాలా మంది సొంత వాహనాలు, క్యాబ్‌లలోనే ప్రయాణించారు. భోగి పండుగకు ముందు వరకు విజయవాడ వైపు 73,240 వాహనాలు అదనంగా వచ్చాయని టోల్‌ప్లాజాల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రయాణానికి చాలా మంది ఐటీ ఉద్యోగులు తమ ద్విచక్ర వాహనాలను వినియోగించడం విశేషం.
Updated Date - Jan 14 , 2025 | 03:06 AM