Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడిని కాపాడిన వారికి సత్కారం
ABN , Publish Date - Apr 12 , 2025 | 10:24 AM
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్‌ను కాపాడిన నలుగురు భారతీయ వలస కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. ఆ వివరాలు..

నాలుగు రోజుల క్రితం అనగా ఏప్రిల్ 8న సింగపూర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోవడంతో.. డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉంది. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్క్‌తో పాటు ఆ ప్రమాదం నుంచి ఇతర పిల్లలను కాపాడిన వారిని సత్కరించింది. వీరంతా భారతీయ వలస కార్మికులే కావడం విశేషం. సింగపూర్ ప్రభుత్వం నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సింగపూర్ సెంట్రల బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్డులో గల మూడంతస్తుల భవనంలో.. ఏప్రిల్ 8న ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది గాయపడగా వారిలో 15 మంది చిన్నారులే ఉన్నారు. వీరిలో పవన్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కూడా ఉన్నాడు. పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థత గురికావటంతో తనని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చిన్నారి శంకర్ కాళ్లు, చేతులకు గాయలయ్యాయి. పవన్ భార్య అన్నా లెజ్‌నోవా ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉన్నారు. అక్కడి స్కూల్‌లోనే మార్క్ శంకర్‌ని చదివిస్తున్నారు.
మార్క్ శంకర్ సింగపూర్‌లోనే చదువుకుంటున్నాడు. ప్రమాదం జరిగిన భవనంలో మార్క్ శంకర్ చదివే టమాటో కుకింగ్ స్కూల్ ఉంది. భద్రతా ప్రమాణాల విషయంలో అప్రమత్తంగా ఉండే సింగపూర్‌లో ఈ ప్రమాదం వెలుగు చూడటం కాస్త షాకింగ్‌గానే ఉంది. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేస్తున్నారు. ఇక కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియడంతో పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లారు. ఆయనతో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు. తమ కుమారుడి క్షేమం కోసం ప్రార్థించిన వారందరికి పవన్ ధన్యవాదాలు తెలిపారు.
పవన్‌కల్యాణ్ కుమారుడికి ప్రమాదం అని తెలిసిన వెంటనే ఫ్యాన్స్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయనాయకులు, సినీ సెలబ్రిటీలు స్పందించారు. అతడి యోగక్షేమాలపై ఆరా తీశారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం దీనిపై స్పందించారు. పవన్‌కల్యాణ్‌కి ఫోన్‌చేసి మాట్లాడారు మోదీ. అంతేకాదు సింగపూర్‌లో ఉన్న ఇండియన్ హై కమిషనర్‌ను అలర్ట్ చేశారు మోదీ. అవసరమైన సహకారం అందించాలని విదేశాంగ శాఖను పురమాయించారు. ఇక తాజాగా సింగపూర్ ప్రభుత్వం ప్రమాదం నుంచి చిన్నారులను కాపాడిన నలుగురు భారత వలస కార్మికులను సత్కరించి.. మంచి మనసు చాటుకుంది.
ఇవి కూడా చదవండి:
Mother Rescue Child: తల్లి ప్రేమకు నిదర్శనం ఈ వీడియో.. హ్యాట్సాఫ్ అమ్మ
MS Dhoni Out: ధోనీ ఔట్ కాలేదా.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం