AP Investment Boost: పరిశ్రమ ఫలించాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:22 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో 17 పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు ఖరారు అయ్యాయి. ఈ ఒప్పందాల ద్వారా రూ.31,167 కోట్ల పెట్టుబడులు రానుండగా, దాదాపు 32,633 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి

ఒప్పందాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలి
ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తారో కనుక్కోవాలి
ఇప్పటిదాకా జరిగిన ఒప్పందాల పురోగతి ఏమిటి?
ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి?
ప్రత్యేక పోర్టల్‌లో వివరాలు పొందుపరచాలి
ఎస్‌ఐపీబీ భేటీలో చంద్రబాబు ఆదేశం
ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూములు
17 పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు ఖరారు
వివిధ రంగాల్లో రూ.31,167 కోట్ల పెట్టుబడులు
32,633 మందికి ఉద్యోగాల కల్పన
10 నెలల్లోనే ఐదు ఎస్‌ఐపీబీ సమావేశాలు
అమరావతి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ‘ఒప్పందాలు కుదుర్చుకోవడం... పెట్టుబడులు రావడం మాత్రమే కాదు! పరిశ్రమలు ప్రారంభం కావాలి... ఆ ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలి!’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. అనుకున్న సమయానికి పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించడం చాలా అవసరమని తెలిపారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఏదైనా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినప్పుడే.. ఆ సంస్థ ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తుందన్న తేదీపై స్పష్టత తీసుకోవాలని సీఎం చెప్పారు. దానికి అనుగుణంగా దశలవారీగా ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న ఎన్ని సంస్థలు ఉత్పత్తి ప్రారంభించాయి.. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనే వివరాలతో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు. ఏ సంస్థ ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చిందో వ్యక్తిగత వివరాలు కూడా సదరు పోర్టల్‌లో ఉంచాలన్నారు. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూ కేటాయింపులు జరపాలని మంత్రి లోకేశ్ కోరగా.. సీఎం ఆమోదం తెలిపారు. సవరించిన భూమి ధరలతో పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో 17 పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలను ఖరారు చేశారు. మౌలిక సదుపాయాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఎనర్జీ తదితర రంగాల్లో రూ.31,167 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను ఆమోదించారు. ఆయా కంపెనీల ద్వారా 32,633 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
10 నెలలు.. రూ.4,71,379 కోట్ల పెట్టుబడులు
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా ఐదు ఎస్‌ఐపీబీ సమావేశాలు జరిగాయి. వీటిలో 57 సంస్థలకు సంబంధించి రూ.4.17.379 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. 4,17,188 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఐదు ఎస్‌ఐపీబీ సమావేశాలను నిర్వహించగా.. కూటమి వచ్చిన పది నెలల్లోనే ఐదు జరిపామని చంద్రబాబు వెల్లడించారు. సమావేశంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇంధనమంత్రి గొట్టిపాటి రవికుమార్, మౌలిక సదుపాయాల కల్పన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడులతో వస్తున్న 17 కంపెనీలివే..
కంపెనీ పెట్టుబడి ఉద్యోగాలు వివరణ
(రూ.కోట్లలో)
మాయా మహామాయ 2063 1000 స్టీల్ ఉత్పత్తి విస్తరణ.. 131 ఎకరాల
ఇండస్ట్రీస్, విజయనగరం భూమితోపాటు ఇతర ప్రోత్సాహకాలు
ప్రీమియర్ ఇంజనీర్స్ 4200 1500 సోలార్ సెల్స్ మాన్యుఫ్యాక్చరింగ్
లిమిటెడ్.., నాయుడుపేట
ఎల్జీ వెండార్స్, శ్రీసిటీ 839 692 వైట్ గూడ్స్ మాన్యుఫాక్చరింగ్
ప్రొటెన్షియల్ లిమిటెడ్, శ్రీసిటీ 1055 515 అమోర్‌ఫాస్ మెటల్ తయారీ
శ్రేష్ఠ ఫార్మ్స్ 459 559 పౌలీ్ట్రఫీడ్
పెట్రా సిలికాన్ లిమిటెడ్ 585 477 సిలికా తయారీకి అనువైన 224 ఎకరాల భూమి
డిక్సన్ టెక్నాలజీస్ కొప్పర్తి ఈఎంసీ తరహా ఈఓటీ ఫీజు
ఏవీశా ఫుడ్స్ 500 500 వ్యవసాయ క్షేత్రం కోసం రాయితీ
ధరపై 115 ఎకరాల భూమి
రాంకో సిమెంట్స్ 478 550 ఏటా 6.3 టన్నుల ఉత్పత్తి.. 79.91 ఎకరాలు
ఎంఎండబ్ల్యూఎల్ 1198 870 మడకశిరలో 325 ఎకరాలు
టాప్‌లైన్ మెటల్ అండ్ 32 200 ఈవోటీ రద్దు.. 10.75
ఎల్లాయ్ ఇండియా ఎకరాలు కేటాయింపు
టాటా కన్సల్టెన్సీ 1370 12000 21.16 ఎకరాల్లో ఐటీ కాంప్లెక్స్ నిర్మాణం
అలా్ట్ర క్లస్టర్స్ 5278 2500 విశాఖలో 59 ఎకరాల్లో
డేటా సెంటర్/ ఐటీ ఆఫీస్
జేఎస్‌డబ్ల్యూ నియో 660 110 88 మెగావాట్ల విండ్ పవర్
ఎనర్జీ, కర్నూలు
రెన్యూ విక్రమ్ శక్తి, అనంతపురం 3000 1050 540 మెగావాట్ల సోలార్ ప్లాంట్
చింతా గ్రీన్ ఎనర్జీ, సత్యసాయి జిల్లా 2450 2400 బ్యాటరీ స్టోరేజీతో 700 మెగావాట్ల
సోలార్ పవర్ ప్లాంట్
చింతా గ్రీన్ ఎనర్జీ 7000 6900 బ్యాటరీ స్టోరేజీతో 2,000 మెగావాట్ల
సౌరవిద్యుదుత్పత్తి
ఈ వార్తలు కూడా చదవండి..
వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం
For More AP News and Telugu News