సత్వరమే తాగునీరందించండి
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:46 PM
జలజీవన్‌మిషన్ ద్వారాసత్వరమే తాగునీరం దించడానికి చర్యలు తీసుకోవాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. శనివారం శ్రీకాకుళంలోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో డీఈఈ సూర్యనారాయణ, జలజీవన్‌మిషన్ ప్రాజెక్డ్ డీఈఈ ఆశాలత లతో ఆమె సమావేశం నిర్వ హించారు.

పలాస,ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి):జలజీవన్‌మిషన్ ద్వారాసత్వరమే తాగునీరం దించడానికి చర్యలు తీసుకోవాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. శనివారం శ్రీకాకుళంలోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో డీఈఈ సూర్యనారాయణ, జలజీవన్‌మిషన్ ప్రాజెక్డ్ డీఈఈ ఆశాలత లతో ఆమె సమావేశం నిర్వ హించారు.ఈసందర్భంగా పలాస నియోజ కవర్గంలో 19పంచాయతీల్లో మాత్రమే అరకొరగా పనులు చేశారని, మిగిలిన గ్రామాల్లో పనులు నాణ్యతతో పూర్తి చేసి అందించే బాధ్యత అధికారులదేనని తెలిపారు. ఆమె వెంట టీడీపీజిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు ఉన్నారు.
ఇంటింటికి ట్యాంకర్లతో నీటి సరఫరా
మునిసిపాలిటీకి ఉద్దానం నీరు వచ్చేవరకూ ట్యాంకర్లతో ఇంటింటికీ నీరు సరఫరాకు చర్యలకు ఆదేశించినట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం పలాస-కాశీబుగ్గలోని 27వ వార్డు ఉల్లాసపేట కాలనీలో నీలమణిదుర్గ అమ్మవారి ఆలయం వరకూ సీసీరోడ్డుకు శంకు స్థాపన చేయడంతోపాటు హడ్కోకాలనీలో నిర్మించిన పవర్ బోరు ప్రారం భించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీహయాంలోనే జంట పట్టణాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి పని పూర్తి చేయలేదని చెప్పారు. కాశీబుగ్గ ఫ్లైఓవర్ పనులను పూర్తి చేయడానికి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సహకారంతో రూ.48 కోట్లు విడుదలచేసినట్లు తెలిపారు. త్వరలో కేంద్రీయ విద్యాల యం నిర్మించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బళ్ల గిరిబాబు, కౌన్సిలర్, గురిటి సూర్యనారాయణ, కామేశ్వరరావు యాదవ్, గాలి కృష్ణారావు,రవిశంకర్‌గుప్తా, మల్లా శ్రీనివాస్,నాగరాజు, సప్ప నవీన్, ఎం.నరేంద్ర, అంబటి కష్ణమూర్తి, దడియాల నర్సింహులు పాల్గొన్నారు.