Share News

Inter ఇంటర్‌ విద్య బలోపేతానికి కృషి: ఎమ్మెల్యే బగ్గు

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:49 PM

Inter ఇంటర్‌ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమ ణమూర్తి అన్నారు.

Inter ఇంటర్‌ విద్య బలోపేతానికి కృషి: ఎమ్మెల్యే బగ్గు
విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమ ణమూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’లో భాగంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. వేసవిలో తరగతులను నిర్వహిం చడంతో పాటు నూతన సిలబస్‌ను అందు బాటులోకి తీసుకువచ్చిందన్నారు. జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్‌, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా సిలబస్‌ను మంత్రి నారా లోకేశ్‌ కృషి ఫలితంగా రూపొందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, మాజీ సర్పంచ్‌ గొద్దు చిట్టిబాబు, ఉణ్న వెంకటేశ్వరరావు, బోయన ఆనంద్‌, జామి వెంకట్రావు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 11:49 PM