క్యాన్సర్ పేషెంట్‌కి ధైర్యం చెప్పిన హోంమంత్రి
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:38 AM
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను దగ్గరి నుంచి చూడాలని శ్రీకాకుళం నగరాని కి చెందిన లతశ్రీ ఎదురుచూస్తుంది.

వీడియో కాల్‌లో మాట్లాడిన అనిత
శ్రీకాకుళం క్రైం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను దగ్గరి నుంచి చూడాలని శ్రీకాకుళం నగరాని కి చెందిన లతశ్రీ ఎదురుచూస్తుంది. ఈమె గత ఎనిమిదేళ్లగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. సభలు, సమావేశాల్లో హోం మంత్రి అనిత మాట్లాడుతున్న తీరును లతశ్రీ టీవీల్లో చూస్తుం డేది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనితను దగ్గర నుంచి చూడా లని ఉందంటూ లతశ్రీ తన భర్త ఆనంద్‌కు చెప్పింది. ఈ విషయా న్ని తన స్నేహితుల ద్వారా హోంమంత్రికి ఆనంద్ తెలి యజేశారు. దీంతో హోంమంత్రి అనిత ఆదివారం రాత్రి వీడియో కాల్‌లో లతశ్రీతో మాట్లాడారు. ధైర్యాన్ని మించిన మందులు లేవని ఆమెకు హోంమంత్రి ధైర్యం చెప్పారు. పెద్దపెద్ద అనారోగ్య సమస్య లతో సతమతమవుతున్నవారు కూడా మనోధైర్యంతో కోలుకుంటు న్నారని, నువ్వు కూడా మనోధైర్యంతో ఉండాలని లతశ్రీకి హోం మంత్రి సూచించారు. త్వరలోనే శ్రీకాకుళం వచ్చి కలుస్తానని లతశ్రీకి భరోసా ఇచ్చారు.