సర్పంచ్ మృతిపై దర్యాప్తు నిర్వహించండి
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:55 PM
వజ్రపుకొత్తూ రు మండలంలోని నువ్వలరేవు సర్పంచ్‌గా వ్యవహరించిన బైనపల్లి రఘు మృతిపై కుటుంబ సభ్యులతోపాటు తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, ఈవిషయం పై సమగ్రంగా దర్యాప్తు నిర్వహించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, టీడీపీ నాయకులు సూరాడ మోహనరావు,కుత్తమ లక్ష్మణ్, పుచ్చ ఈశ్వరరా వు కోరారు.

పలాస, ఏప్రిల్ 5(ఆం ధ్రజ్యోతి): వజ్రపుకొత్తూ రు మండలంలోని నువ్వలరేవు సర్పంచ్‌గా వ్యవహరించిన బైనపల్లి రఘు మృతిపై కుటుంబ సభ్యులతోపాటు తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, ఈవిషయం పై సమగ్రంగా దర్యాప్తు నిర్వహించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, టీడీపీ నాయకులు సూరాడ మోహనరావు,కుత్తమ లక్ష్మణ్, పుచ్చ ఈశ్వరరా వు కోరారు.ఈ మేరకు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణకు వినతిపత్రం శనివారం మధ్యాహ్నం సమర్పించారు. ఈ సందర్భంగా విఠల్‌రావు మాట్లా డుతూ గత ఏడాది ఏప్రిల్ 4న నువ్వలరేవు సమస్యలపై అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజుతో చర్చించేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లి రఘు మాట్లాడారని, ఆ క్రమంలో ఇద్దరి మఽధ్య బేధాబిప్రాయాలు వచ్చాయని, మంత్రితో విబేధించిన రఘు డీఎస్పీకి సమస్య విన్నవించారని తెలిపారు. అనంతరం పలాస-కాశీబుగ్గలో రఘు శవంగా కనిపించాడని తెలిపారు. ఈ కేసు పునర్విచారణచేసి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారని తెలిపారు.