Share News

minister achhenna : ప్రజల జీవితాల్లో వెలుగులు

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:53 PM

Social Welfare ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో ఆయన సామాజిక పింఛన్ల పంపిణీని ప్రారంభించారు.

minister achhenna : ప్రజల జీవితాల్లో వెలుగులు
వృద్ధుడికి పింఛన్‌ అందజేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • - అదే నిజమైన సంక్షేమం

  • - మంత్రి అచ్చెన్నాయుడు

  • కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం కోటబొమ్మాళి మండలం కిష్టుపురంలో ఆయన సామాజిక పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్‌ అందజేశారు. అనంతరం మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం రూ.2వేలు ఉన్న పింఛన్‌ను విడతల వారీగా రూ.3వేలకు పెంచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు పింఛన్‌ను రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచి ప్రతీనెలా ఠంచన్‌గా ఒకటో తేదీనే పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. దివ్యాంగులు, డయాలసిస్‌ రోగులు, మంచానికే పరిమితమైన వారికి సైతం ఆర్థిక భరోసానిచ్చేలా రెట్టింపు పింఛన్‌ అందజేస్తున్నామ’ని తెలిపారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్‌ అప్పలరాజు, ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌, టీడీపీ నాయకుడు కింజరాపు హరివరప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:53 PM