పార్టీ విధేయులకే గుర్తింపు
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:47 PM
టీడీపీ ఆవిర్భావం నుంచి కష్టపడేవారికే గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.

నరసన్నపేట, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఆవిర్భావం నుంచి కష్టపడేవారికే గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శనివారం నరసన్నపేటలోని క్యాంపు కార్యాలయంలో జలుమూరు, నరసన్నపేట మార్కెట్ కయిటీ చైర్మన్లగా నియమితులైన తర్ర బలరాం,పోగోటి ఉమామహేశ్వరి ఎమ్మెల్యేను అభినందించారు.ఈసం దర్భంగా మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టకాలం వరకు గ్రామాల్లో అటుపోట్లు ఎదుర్కొని నిలబడిన విధేయులకు టీడీపీ గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో అప్పలనాయుడు, శ్రీముఖలింగం, కంబకాయి గ్రామ టీడీపీ నాయకులు కృష్ణమూర్తి, మహేంద్ర, తమ్మగారి సతీష్ పాల్గొన్నారు.