Share News

పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలి

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:48 PM

శ్రీముఖలింగంలో మూడు రోజులు పాటు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు పారిశుధ్యం పనులు పక్కాగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి సౌజన్య భారతి ఆదేశించారు.

 పారిశుధ్య పనులు పక్కాగా చేపట్టాలి
శ్రీముఖలింగంలో పారిశుధ్యం పనులపై సూచనలిస్తున్న సౌజన్య భారతి:

జలుమూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగంలో మూడు రోజులు పాటు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు పారిశుధ్యం పనులు పక్కాగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి సౌజన్య భారతి ఆదేశించారు. శుక్రవారం శ్రీముఖలింగంలో పారిశుధ్యం పనులపై అధికారులతో సమీక్షించారు. ప్రతి వీధిలోను వీధి దీపాలు వేయించాలని తెలిపారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. పారిశుధ్య పనులకోసం టెక్కలి, నరసన్నపేట నుంచి పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో ఐవీరమణ, ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు, సర్పంచ్‌ టి.సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

శివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయండి

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి శ్రీముఖలింగం మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయి ప్రత్యూష ఆదేశించారు. శుక్రవారం శ్రీముఖలింగంలో అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి దర్శనంకోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. ఉచిత, ప్రత్యేక దర్శనాలకు వచ్చే భక్తులకు వేర్వేరు బారికేడ్లు ఏర్పాటుచేయాలని కోరారు. జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాని, స్నానఘట్టాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందిలేకుండా లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఆలయం సమీపంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అన్ని వీధుల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. సమావేశంలో దేవదాయశాఖ ఏసీ ప్రసాద్‌ పట్నాయక్‌, ఈవో పి.ప్రభాకరరావు, తహసీల్దార్‌ జన్ని రామారావు, డీఎల్పీవో ఐవీరమణ, ఎంపీడీవో కె.అప్పలనాయుడు, ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ అశోక్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 11:48 PM