శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:04 AM
జిల్లా అభివృ ద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

శ్రీకాకుళం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృ ద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడితో కలసి పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమ గ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.500 కోట్లతో మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టాలని ఆదేశించారు. భూగర్భ జలాల పెంపునకు చెక్ డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, పల్లె పుష్కరు ణులు, ఫిష్ డ్రై ప్లాట్‌ఫాంలు, ఫామ్ పాండ్స్ నిర్మాణా నికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మంత్రి అచ్చె న్న మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2014-19 మధ్య కాలంలో నిర్మించిన చెత్త నుంచి సంపద యూనిట్లను ఉపయోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
వేసవిలోపే రోడ్ల పనులు
జిల్లాలో గుంతలు లేని రోడ్ల పనులు ఇప్పటికే 96 శాతం పూర్తయ్యాయని.. వేసవి ముగిసేలోపు మిగి లిన పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్న ఆదేశించారు. శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు విస్త రణలో భాగంగా నగర పరిధిలో ఆస్తినష్టం జరిగే వారికి రూ.7 కోట్లు పరిహారం మంజూరుకు ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. రాగోలులో రూ. 2.92 కోట్లతో సైనిక్ భవన్ నిర్మాణానికి త్వర లోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రాకకు వీలుగా ముహుర్తం సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నరసన్నపేటలో వంశధార షట్టర్ల విష యమై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 ఏళ్లుగా ఏసీబీలో కేసు ఉందని.. నీరుగారుస్తూ ఉంటే ఎలా అని ప్రశ్నించారు. అవసరమైతే అధికారులు తనతో విజయవాడ రావాలని.. శాశ్వత సమస్యకు పరిష్కా రం కనుగొందామని చెప్పారు. ప్రతి నియోజకవర్గం లో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేసేందుకు స్థలం సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశం లో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్వి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ..
జిల్లాలో పిల్లలకు నాణ్యమైన పోషణ, ప్రాథమిక విద్యను అందించేందుకు పోషణ పఖ్వాడా కార్యక్ర మం దోహదపడుతుందని ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన హబ్ అంగన్‌వాడీ కేంద్రాల కార్యక్రమానికి మంత్రి కొండ పల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. మంగళవారం కలెక్ట రేట్‌లో సమావేశం అనంతరం పోషణ పఖ్వాడా పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ పాల్గొన్నారు.
మహిళలకు మరింత ఆదాయం..
జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు అధిక ఆదాయ అవకాశాలు కల్పించేందు కు వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి సమగ్ర ప్రతిపాదనలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదే శించారు. కలెక్టరేట్‌లో సమీక్ష అనంతరం మాట్లా డుతూ ‘స్వయం సహాయ సంఘాల మహిళలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఉపాధి యూనిట్లు ప్రారంభించేందుకు అనుకూల రంగాలను గుర్తించాలి. శ్రీనిధి, ఉన్నతి పథకాలు.. నాబార్డు ప్రాజెక్టులపై సమీక్ష చేశాం. వ్యవసాయ అనుబంధ రంగాలు, లాభదాయక పంటల సాగు, సేవా రంగాలు, ఉత్పత్తి రంగాల్లో యూనిట్ల ఏర్పాటుతో మహిళలకు అధిక ఆదాయ అవకాశాలు లభిస్తా య’ని మంత్రి అన్నారు.